ఎమ్మెల్యేలను కొనగలరేమో కానీ పార్టీని కాదు: మమతా బెనర్జీ

ఎమ్మెల్యేలను కొనగలరేమో కానీ పార్టీని కాదు: మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీజేపీపై సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీని ఎన్నటికీ కొనలేరని ఆమె స్పష్టం చేశారు. మీరు కొందరు ఎమ్మెల్యేలను కొనగలరేమో… కానీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీని మాత్రం ఎప్పటికీ కొనలేరని స్పష్టం చేశారు. బోల్పూర్ లో జరిగిన బహిరంగ సభలో పాల్గోన్న మమత మాట్లాడుతూ.. హింసావాద, విభజన రాజకీయాలు ఆపాలని హితవు పలికారు. బెంగాల్ ను ‘సోనార్ బంగ్లా’ (స్వర్ణ బెంగాల్) గా మార్చుతామంటూ కొందరు రాష్ట్రానికి వస్తున్నారని, కానీ రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాల్ ను ఎప్పుడో ‘సోనార్ బంగ్లా’గా మార్చారన్నారు మమతా బెనర్జీ. ఇప్పుడు చేయాల్సింది మతతత్వ శక్తుల నుంచి ఆ ‘సోనార్ బంగ్లా’ను కాపాడుకోవడమేనని స్పష్టం చేశారు.