చంద్రబాబుకు కమ్యూనిస్ట్ నేత ఫోన్ : మీరు దేశానికి భవిష్యత్ అంటూ వ్యాఖ్య

ఏపీలో సునామీ విక్టరీ సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు లెఫ్ట్ పార్టీకి చెందిన సీనియర్ నేత ఫోన్ చేసి అభినందించటం ఆసక్తిగా మారింది. ఏపీలో ఒంటరిగా 16 పార్లమెంట్ సీట్లు సాధించినందుకు అభినందనలు తెలుపుతూనే.. మీరు ఈ దేశానికి భవిష్యత్ కాగలరు అంటూ కామెంట్ చేయటం సంచలనంగా మారింది. 

దేశవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమికి 295 సీట్లు మాత్రమే వచ్చాయి. అయితే బీజేపీకి మాత్రం 240 స్థానాల్లోనే గెలుపొందింది. దీంతో ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న నితీష్ కుమార్, చంద్రబాబు కీలకంగా మారారు. వీళ్లిద్దరూ లేకపోతే ఎన్డీఏ తిరిగి అధికారం చేపట్టటం సాధ్యం కాదు. బీజేపీ అధికారం చేపట్టానికి మ్యాజిక్ ఫిగర్ 272 స్థానాలకు దూరంగా ఉండటంతో.. ఇదే సమయంలో కాంగ్రెస్ కూటమికి కూడా వీళ్లిద్దరి మద్దతు అవసరం అయ్యింది. ఈ క్రమంలోనే అటు ఎన్డీఏ, ఇటు కాంగ్రెస్ కూటమి ఇండియా నేతలు అప్రమత్తం అయ్యారు. 

 

ఇండియా కూటమిలోని ఓ సీనియర్ కమ్యూనిస్ట్ నేత.. చంద్రబాబుకు ఫోన్ చేసి మీరు దేశానికి కాబోయే భవిష్యత్ అని వ్యాఖ్యానించినట్లు.. జాతీయ ఛానెల్ లో రాజ్ దీప్ సర్దేశాయ్ వ్యాఖ్యానించటం ఆసక్తిగా మారింది.