నానమ్మ అపరిచిత వ్యక్తే.. బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ తల్లి పిటిషన్​ను కొట్టేసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: మనవడిని తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ బెంగళూరు టెకీ అతుల్ సుభాశ్ తల్లి వేసిన పిటిషన్​ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఈ మాట మేం చెప్పకూడదు కానీ.. ప్రస్తుతానికి మీరు ఆ బిడ్డకు అపరిచిత వ్యక్తి మాత్రమే. కావాలనుకుంటే వెళ్లి ఆ చిన్నారిని చూసిరండి. బాలుడి కస్టడీ కావాలనుకుంటే.. అదంతా వేరే ప్రక్రియ’’ అని తెలిపింది.

బెంగళూరు టెకీ అతుల్ సుభాశ్ తల్లి అంజుదేవి సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది. మనవడిని తమ కస్టడీకి అప్పగించాలని కోరింది. మంగళవారం ఈ పిటిషన్​ విచారణ సందర్భంగా జస్టిస్‌‌‌‌ బేలా ఎం. త్రివేది, ఎన్. కోటీశ్వర్ సింగ్​ల బెంచ్​ ఈ కామెంట్స్ చేసింది. బాలుడిని కోర్టులో హాజరు పరచాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను జనవరి 20 కి వాయిదా వేసింది.