న్యూఢిల్లీ : యెస్ బ్యాంక్ వాటాను కొనడానికి యూరప్ ఆసక్తి చూపుతున్నాయని, పేర్లను త్వరలోనే వెల్లడిస్తామని బ్యాంక్ సీఈఓ రన్‌వీత్ గిల్ చెప్పారు. ఎర్విన్ సింగ్ వంటి ఇన్వెస్టర్ల సామర్థ్యంపై వస్తున్న ఆందోళనలు అనవసరమని అన్నారు. వాటాల అమ్మకం ద్వారా యెస్ బ్యాంక్ రూ.14,146 కోట్లను సేకరించాలనుకుంటోంది. అయితే ఫ్యామిలీ ఆఫీస్‌లకు షేర్లను జారీ చేసేందుకు సిద్ధంగా లేదని గిల్ సంకేతాలిచ్చారు. చర్చలు అడ్వాన్స్ స్టేజీలో ఉన్నాయని, త్వరలోనే బైండింగ్ అగ్రిమెంట్‌కు వస్తామని తెలిపారు. బిడ్స్ దాఖలు చేశాక, వారి పేర్లను బయటికి వెల్లడవుతాయని చెప్పారు. ఇదిలా ఉంటే, క్విప్ ద్వారా రూ.2 వేల కోట్లను సేకరించుకోవడానికి సిక్స్ మంత్(ఆరు నెలల) రూల్ నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని యెస్ బ్యాంక్ సెబీని కోరుతోంది. ఒకసారి క్విప్ ద్వారా ఫండ్స్‌ను సేకరించిన తర్వాత ఆరు నెలల తర్వాతనే మళ్లీ దీని ద్వారా ఫండ్స్‌ను తీసుకోవాలి. యెస్ బ్యాంక్ అంతకుముందు ఆగస్ట్‌లో రూ.1,930 కోట్లను సమీకరించింది. మళ్లీ జనవరిలో రూ.2 వేల కోట్లను సేకరించుకోవాలనుకుంటోంది.
