చౌడేశ్వరీ మాత ఆలయంలో పూజలు : యెన్నం శ్రీనివాస్ రెడ్డి

పాలమూరు, వెలుగు: అందరికీ చౌడేశ్వరి మాత ఆశీస్సులు ఉండాలని మహబూబ్ నగర్  ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం మహబూబ్ నగర్  మున్సిపాలిటీ పరిధిలోని పాలకొండలో కొత్తగా నిర్మించిన  చౌడేశ్వరీ మాత ఆలయంలో మున్సిపల్  చైర్మన్  ఆనంద్ గౌడ్ తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక చింతన అవసరమని పేర్కొన్నారు. 

ఆలయ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. సిరాజ్ ఖాద్రీ, లక్ష్మణ్ యాదవ్, పటేల్ శ్రీనివాస్ రెడ్డి, శివుడు, ఆంజనేయులు, గోపాల్ శ్రీను, మల్లేశ్​ పాల్గొన్నారు.