జగన్ కు షాక్ మీద షాక్ ఇస్తున్న షర్మిల - వైసీపీ నుండి కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే

2024 ఎన్నికలే టార్గెట్ గా జగన్ ఇరకాటంలో పెట్టే దిశగా వేగంగా పావులు కదుపుతోంది ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఇప్పటికే జగన్ మీద వరుస విమర్శలు చేస్తూ దూకుడు మీదున్న షర్మిల వైసీపీని నిర్వీర్యం చేసే పనిలో పడింది. ఇటీవలే కర్నూలు జిల్లాకు చెందిన ఇద్దరు వైసీపీ నాయకులను కాంగ్రెస్ లో చేర్చుకున్న షర్మిల తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకుంది. చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నముట్ల ఎలిజా షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి షర్మిల ఎలిజాను పార్టీలోకి ఆహ్వానించింది.

వైసీపీ బలమైన ఓట్ బ్యాంక్ ఉన్న క్రిస్టియన్, ముస్లిమ్, మైనారిటీ వర్గాల నుండి చేరికలు ప్రోత్సహించి వైసీపీని అధికారంలోకి రాకుండా చేయటమే షర్మిల ప్లాన్ అని అనిపిస్తోంది. షర్మిలకి తోడుగా వివేకా భార్య సౌభాగ్యమ్మ, కూతురు సునీత కూడా జగన్ మీద విమర్శలు చేస్తుండటంతో వైసీపీకి కొత్త తలనొప్పిగా మారింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి తోడు షర్మిల కూడా తోడవ్వడంతో వచ్చే ఎన్నికలు హోరాహోరీగా ఉండనున్నాయి.  మరి, ఉత్కంఠ రేపుతున్న ఈ పోరులో విజయం ఎవరిదో తెలియాలంటే కొంత కాలం వేచి చూడక తప్పదు.