ఏపీలో వైసీపీ నాయకుల అరెస్ట్ పరంపర కొనసాగుతోంది. ఇటీవల ఎన్నికల సమయంలో ఘర్షణల కారణంగా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టైన సంగతి తెలిసిందే. తాజాగా మరో వైసీపీ నాయకుడు, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ ను అరెస్ట్ చేశారు చేశారు పోలీసులు. బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో సుధాకర్ పై పోక్సో యాక్టు కింద కేసు నమోదు చేశారు పోలీసులు. గురువారం కర్నూలులోని తన నివాసంలో సుధాకర్ ను అదుపులోకి తీసుకున్నారు టూ టౌన్ పోలీసులు.
వైద్య పరీక్షల అనంతరం సుధాకర్ ను కోర్టులో ప్రవేశ పెట్టగా అతనికి రిమాండ్ విధించింది కోర్టు. సుధాకర్ తన ఇంట్లో పని చేసే బాలికపై అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఆ మధ్య సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. 2019 ఎన్నికల్లో కోడుమూరు నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు సుధాకర్.కాగా, 2024 ఎన్నికల్లో టికెట్ దక్కలేదు.