2019 ఎన్నికల్లో మంగళగిరి నుండి పోటీ చేసి ఓడిపోయిన నారా లోకేష్, రానున్న 2024 ఎన్నికల్లో కూడా అక్కడి నుండే పోటీ చేయాలని డిసైడ్ అయ్యాడు. గత ఎన్నికల్లో లోకేష్ పై గెలిచిన ఆర్కే పార్టీని వీడటంతో ఆ సీటును గంజి చిరంజీవికి కేటాయించింది వైసీపీ. అయితే, తాజాగా వైసీపీ అనౌన్స్ చేసిన 9వ జాబితాలో మంగళగిరి నుండి చిరంజీవి పేరు కాకుండా లావణ్య పేరును ప్రకటించింది. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలే ఈ లావణ్య.
ఈ నేపథ్యంలో చిరంజీవి కొత్త అభ్యర్థి లావణ్యకు సహకరిస్తారా లేదా అన్న అనుమానం మొదలైంది. ఈసారి కూడా లోకేష్ ని అసెంబ్లీలో అడుగుపెట్టనివద్దనే ఉద్దేశంతోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని వైసీపీ శ్రేణులు అంటున్నారు. ఇంకా ఈ జాబితాలో నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ఎంపీ విజయసాయిరెడ్డి పేరును అనౌన్స్ చేసింది వైసీపీ.
also read :పవన్ కి పోటీగా ముద్రగడ... జగన్ మాస్టర్ ప్లాన్..!
ఇటీవలే పార్టీని వీడిన సీనియర్ నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ నుండి నెల్లూరు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ స్థానానికి విజయసాయిరెడ్డిని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. నెల్లూరు కేంద్రంగా వేగంగా మారుతున్న సమీకరణాలను వైసీపీకి అనుగుణంగా మార్చే బాధ్యతను జగన్ విజయసాయిరెడ్డికి అప్పగించాడు. మరి, కీలక నియోజికవర్గమైన మంగళగిరిలో అభ్యర్థి మార్పు ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి.