IND vs AUS: ప్రాక్టీస్‌లో జైశ్వాల్ దూకుడు.. కొడితే రోడ్డుపై పడిన బంతి

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీపైనే ప్రస్తుతం భారత జట్టు దృష్టి మొత్తం ఉంది. టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరాలంటే ఆస్ట్రేలియాపై ఈ సిరీస్ ను భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. సొంతగడ్డపై కానుండడం కంగారులకు కలిసి రానుంది. మరోవైపు టీమిండియా పేలవ ఫామ్ లో ఉంది. ఇరు జట్ల మధ్య జరగనున్న ఈ టెస్ట్ సిరీస్ కు ఈ సారి భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే టీమిండియా ఆస్ట్రేలియాకి చేరుకోగా నవంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టుకు అప్పుడే ప్రాక్టీస్ ప్రారంభించేశారు. 

మంగళవారం (నవంబర్ 12) నెట్ సెషన్‌లో భాగంగా టీమిండియా ఓపెనర్ జైశ్వాల్ తన తడాఖా చూపించాడు. ప్రాక్టీస్ లో జైశ్వాల్ ఒక భారీ షాట్ కొట్టాడు. ఈ బంతి కాస్త పక్కనే ఉన్నరోడ్డులో పడింది. ఈ ఫోటోని అక్కడ ఉన్న ఓ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో రోడ్డు మీదున్న మనుషులకు, వాహనాలకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. సమీపంలో ఉన్న పాఠశాల అప్పటికే పూర్తయింది. ఈ నెట్ సెషన్స్‌లో కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ చెమటోడ్చారు. 

ALSO READ | IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్‌గా భారత వరల్డ్ కప్ విన్నింగ్ బౌలర్

ఆస్ట్రేలియా గడ్డపై చివరగా జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను భారత జట్టు గెలుచుకుంది. విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్  72 ఏళ్లలో తొలిసారి 2-1 తేడాతో ఆసీస్ గడ్డపై సిరీస్ గెలిస్తే.. 2020-21లో తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానే సారధ్యంలో 2-1 తేడాతో సిరీస్ గెలుచుకుంది. చివరిసారిగా 2023 లో భారత్ వేదికగా నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను భారత్ 2-1 తేడాతో గెలుచుకోవడం విశేషం.

1991–92 తర్వాత ఇరుజట్ల మధ్య ఐదు టెస్ట్‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌గా నిర్వహించడం ఇదే తొలిసారి. గతంలో ఎక్కువగా నాలుగు టెస్ట్‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌గానే  నిర్వహించేవారు.సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ నవంబర్ 22న పెర్త్ లో జరుగుతుంది. డిసెంబర్ 6 నుంచి 10 వరకు అడిలైడ్ వేదికగా రెండో టెస్టు డే నైట్ జరుగుతుంది. డిసెంబర్ 14 నుంచి 18 వరకు గబ్బాలో మూడో టెస్ట్.. డిసెంబర్ 26 నుంచి 30 వరకు ఎప్పటిలాగే నాలుగో టెస్ట్ బాక్సింగ్ డే రోజున ప్రారంభమవుతుంది.మెల్బోర్న్ లో ఈ టెస్ట్ జరుగుతుంది. చివరిదైన ఐదో టెస్ట్ జనవరి 3 నుంచి 7 వరకు సిడ్నీ వేదికగా జరుగుతుంది.