Yashasvi Jaiswal: ఎలైట్ లిస్టులో జైశ్వాల్.. మూడో భారత క్రికెటర్‌

భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అరంగ్రేటం చేసిన ఏడాదిలోనే అరుదైన ఘనత సాధించాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో టెస్టుల్లో1000కి పైగా పరుగులు చేసిన మూడో భారతీయుడిగా.. ప్రపంచంలో ఏడవ ఆటగాడిగా నిలిచాడు. జూలై 2023లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఈ ఓపెనర్.. పూణే టెస్టులో ఈ ఘనత సాధించాడు. తద్వారా  లెజెండరీ క్రికెటర్ గుండప్ప విశ్వనాథ్, సునీల్ గవాస్కర్‌ సరసన చేరాడు.

స్వదేశంలో ఆడిన టెస్టుల్లో క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ పేరిట ఉంది. అతను 2012లో 1407 పరుగులు చేశాడు. అతని తర్వాత పాకిస్థాన్ ఆటగాడు మహ్మద్ యూసుఫ్ (2006లో 1126 పరుగులు) చేశాడు.

ALSO READ | IND vs NZ 2nd Test: కోహ్లీకే ఎందుకిలా.. అంపైర్లు ఎందుకు పగ బడుతున్నారు

ఒక క్యాలెండర్ ఇయర్‌లో హోమ్ టెస్టుల్లో 1000+ పరుగులు

  • 1407 పరుగులు: మైకేల్ క్లార్క్ (ఆస్ట్రేలియా, 2012)
  • 1126 పరుగులు: మహ్మద్ యూసుఫ్ (పాకిస్థాన్‌, 2006)
  • 1058 పరుగులు: గ్రహం గూచ్ ( ఇంగ్లండ్‌, 1990)
  • 1047 పరుగులు: గుండప్ప విశ్వనాథ్ (భారత్, 1979)
  • 1025* పరుగులు: యశస్వి జైస్వాల్ (భారత్, 2024)
  • 1013 పరుగులు: సునీల్ గవాస్కర్ ((భారత్, 1979)
  • 1012 పరుగులు: జస్టిన్ లాంగర్ (ఆస్ట్రేలియా, 2004)