Yashasvi Jaiswal: కివీస్ గ్రేట్ వెనక్కి.. చరిత్ర సృష్టించిన జైస్వాల్

ఆసీస్ బ్యాట‌ర్లు త‌డ‌బ‌డిన చోట‌.. భారత యువ బ్యాటర్ య‌శ‌స్వీ జైస్వాల్(90 నాటౌట్) సెంచరీ దిశగా సాగుతున్నాడు. ఎంతో ఓపికతో.. ఎన్నో మ్యాచ్‌ల అనుభవం ఉన్న ఆటగాడిగా నిలకడగా ఆడుతున్నాడు. పేసీ పిచ్‌పై అత్యుత్తమ ఆసీస్ పేస్ ద‌ళాన్ని అతను ఎదుర్కొన్న మాజీలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.

రెండో రోజులో ఆటలో జైస్వాల్ 193 బంతుల్లో  7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 90 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ రెండు 2 సిక్సర్లతో ఈ భారత ఓపెనర్.. న్యూజిలాండ్ మాజీ దిగ్గజం బ్రెండన్ మెకల్లమ్ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. టెస్టు క్రికెట్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.

2014లో  కివీస్ గ్రేట్ మెకల్లమ్ 33 సిక్సర్లు కొట్టగా.. జైస్వాల్ ఈ ఏడాది 34 సిక్సర్లు బాదాడు. ఈ భారత యువ ఓపెనర్ ఇప్పటికే వీరేంద్ర సెహ్వాగ్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. 2008లో సెహ్వాగ్ 22 సిక్సర్లు కొట్టగా.. జైస్వాల్ దానిని ఎప్పుడో అధిగమించాడు.

టెస్ట్ క్రికెట్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు

  • 1. యశస్వి జైస్వాల్: 34 సిక్సర్లు(2024)
  • 2.  బ్రెండన్ మెకల్లమ్: 33 సిక్సర్లు(2014)
  • 3. బెన్ స్టోక్స్: 26 సిక్సర్లు (2022)
  • 4. ఆడమ్ గిల్‌క్రిస్ట్: 22 సిక్సర్లు (2005)
  • 5. వీరేంద్ర సెహ్వాగ్: 22 సిక్సర్లు (2008)