టీమిండియా యువ ఓపెనర్ టెస్టు క్రికెట్ లో సూపర్ ఫామ్ తో దూసుకెళ్తున్నాడు. ప్రత్యర్థి, వేదికతో సంబంధం లేకుండా పరుగుల వరద పారిస్తున్నాడు. ముఖ్యంగా 2024 లో జైశ్వాల్ అత్యంత నిలకడగా రాణిస్తున్నాడు. ఈ క్రమంలో అతను 2024 లో టెస్ట్ క్రికెట్ లో 1000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ రెండో రోజు ఆటలో భాగంగా జైశ్వాల్ ఈ ఘనతను అందుకున్నాడు.
అజాజ్ పటేల్ వేసిన 23 ఓవర్ రెండో బంతికి ఫోర్ కొట్టి ఈ ఏడాది 1000 పరుగుల మార్క్ ను పూర్తి చేసుకొన్న ఏకైక భారత ప్లేయర్ గా నిలిచాడు. దీంతో ఈ ఏడాది రూట్ తర్వాత 1000 పరుగుల మార్క్ అందుకున్న ప్లేయర్ గా నిలిచాడు. రూట్ 1305 పరుగులతో అత్యధిక పరుగుల స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. పూణే టెస్టులో 30 పరుగులు చేసి పర్వాలేదనిపించిన జైశ్వాల్.. వచ్చిన చక్కని ఆరంభాన్ని భారీ స్కోర్ చేయడంలో విఫలమయ్యాడు. జైశ్వాల్ తో భారత బ్యాటర్లు విఫలమవడంతో భారత్ 7 వికెట్లకు 107 పరుగులతో కష్టాల్లో పడింది.
గతేడాది వెస్టిండీస్ పై టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ ముంబై బ్యాటర్..ఆరు నెలల్లోనే తన టెస్ట్ కెరీర్ లో 1000 పరుగుల మైలురాయిని పూర్తి చేసుకున్నాడు. డెబ్యూ టెస్టులోనే భారీ సెంచరీతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిచ్చర పిడుగు తన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. కేవలం 16 ఇన్నింగ్స్ ల్లోనే 1000 పరుగుల మార్క్ చేరుకున్నాడు. దీంతో వేగంగా 1000 పరుగులు చేసిన రెండో భారతీయుడిగా నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డ్ మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లే పేరిట ఉంది. అతను 14 ఇన్నింగ్స్ ల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు.
Yashasvi Jaiswal becomes the ????? ?????? ?? ????? ???? ???? in Test cricket in 2024 ?#INDvNZ #YashasviJaiswal #TeamIndia pic.twitter.com/bimfVDyptu
— OneCricket (@OneCricketApp) October 25, 2024