ఆస్ట్రేలియా టూర్‌‌లో..ఖలీల్‌‌ ప్లేస్‌‌లో యష్​

పెర్త్‌‌ : ఆస్ట్రేలియా టూర్‌‌లో ఉన్న టీమిండియా రిజర్వ్‌‌ ప్లేయర్లలో ఒక్క మార్పు చోటు చేసుకుంది. గాయపడిన పేసర్‌‌ ఖలీల్ అహ్మద్‌‌ ప్లేస్‌‌లో యష్‌‌ దయాల్‌‌ను తీసుకున్నారు. నెట్స్‌‌లో బౌలింగ్‌‌ చేస్తున్న క్రమంలో ఖలీల్‌‌కు గాయమైంది. అయితే ఎలాంటి ఇంజ్యురీ అన్న దానిపై స్పష్టత లేదు. కాకపోతే బౌలింగ్‌‌ చేసే అవకాశం కూడా లేకపోవడంతో అతన్ని ఇండియాకు పంపిస్తున్నారు. 

సౌతాఫ్రికాలో ఉన్న యష్​ దయాల్​ డైరెక్ట్‌‌గా పెర్త్‌‌కు వెళ్లనున్నాడు.  ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత ఖలీల్‌‌ సయ్యద్‌‌ ముస్తాక్‌‌ అలీ టీ20 టోర్నీలో ఆడతాడా? లేదా? అన్న దానిపై స్పష్టత లేదు. మంగళవారం బ్యాటింగ్‌‌ ప్రాక్టీస్‌‌ చేస్తుండగా ఎడమ భుజం నొప్పితో ఇబ్బందిపడ్డ యశస్వి జైస్వాల్‌‌ కోలుకున్నాడు. బుధవారం నెట్స్‌‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రాక్టీస్‌‌ చేశాడు. దీంతో ఇండియా మేనేజ్‌‌మెంట్‌‌ ఊపిరి పీల్చుకుంది.