ఢిల్లీలో ఇటీవల కురిసన వర్షాలతో తీవ్ర పరిణామాలు ఎదురవుతున్నాయి. యమునా నది అంతకంతకు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో అక్కడి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పుడిప్పుడే వరద ఉద్దృతి తగ్గుతుందనుకుంటున్న సమయంలో అధికారులు మరో పిడుగు లాంటి వార్త చెబుతున్నారు. నీటి మట్టం త్వరలో 'డేంజర్' మార్క్‌కు చేరుకునే అవకాశం ఉందని, యమునా నది నీటి మట్టం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం 1:00 గంటలకు 205.84 మీటర్ల నీటిమట్టం ఉండగా.. అది మధ్యాహ్నం 12:00 గంటలకు 205.80 మీటర్ల కంటే కొంచెం ఎక్కువగా నమోదు కావడం మరింత ఆందోళనను కలిగిస్తోంది.
యమునా నది నీటి మట్టం పెరుగుదల తాత్కాలికమేనని, ఇప్పుడు స్థానిక సహకారం కారణంగా ఇది జరిగిందని సీడబ్య్లూసీ అధిరకారులు చెబుతున్నారు. ఈరోజు సాయంత్రం వరకు నీటి మట్టం పెరిగి ఆ తర్వాత తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.
మరోవైపు నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి నెలకొంది. ఢిల్లీలోని పలు ప్రాంతాలు వరదలు, నీటి ఎద్దడితో కనిపిస్తోన్న ఈ క్రమంలో మరో వార్త మరింత భయాన్ని కలిగిస్తోంది. ఈ వారం ఢిల్లీలో 27 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని, ఈ ఏడాది ఇప్పటివరకు మొత్తం 163 కేసులు నమోదు అయ్యాయని అధికారులు తెలిపారు. ఈ విషయంపై స్పందించిన ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్.. శిబిరాల్లో ఉన్న ప్రజలను తాను పరామర్శించానని, నీటి వల్ల వచ్చే వ్యాధుల గురించి వారిని అప్రమత్తం చేశానని చెప్పారు. ఆస్పత్రులు, ఇతర ప్రాంతాలకు వెళ్లి తనిఖీలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని, ఉచిత వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఒక్కో శిబిరంలో ఇద్దరు వైద్యులు, పారామెడికల్ నిపుణులు ఉన్నారని, వారు కూడా శిబిరాలను శానిటైజ్ చేశారని చెప్పారు. అధికారులు చెబుతున్న ప్రకారం, సుమారు 200-250 మంది శిబిరాలకు చెకప్‌ల కోసం వస్తారు. వరద బాధితుల కోసం డిజాస్టర్ మేనేజ్‌మెంట్ వార్డును ఏర్పాటు చేసినట్లు వారు అంటున్నారు.
#WATCH | Medical camps have been set up and free medical treatment is given in them. Two doctors along with para-medical staff are presently in all the camps. We revied the camps also. 200-250 people are coming to the camps for the checkup. Mostly, doctors are receiving cases of… pic.twitter.com/gwznHUGdmI
— ANI (@ANI) July 17, 2023
