భారతీయ మార్కెట్లోకి యమహా ఎఫ్‌జెడ్‌– ఎక్స్‌ రీఫ్రెష్ వెర్షన్

భారతీయ మార్కెట్లోకి యమహా ఎఫ్‌జెడ్‌– ఎక్స్‌ రీఫ్రెష్ వెర్షన్

యమహా ఎఫ్‌జెడ్‌– ఎక్స్‌ బైక్ ను 2023 రీఫ్రెష్ వెర్షన్‌గా లాంచ్ చేయనుంది. ఈ రీఫ్రెష్‌ వెర్షన్లో కొత్త రంగులతో పాటు కొన్ని సెక్యూరిటీ ఫీచర్లని జోడించారు. ఇందులో సింగిల్ ఛానల్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్)ని డ్యూయల్ ఛానల్ యూనిట్ తో భర్తీ చేసారు. 150సీసీ ఇంజిన్‌తో వస్తుంది. 115  కేఎంపీహెచ్ స్పీడ్‌తో దూసుకెళ్లొచ్చు. 2023 వెర్షన్ లో ఇంజిన్ లో కొన్ని రకాల మార్పులు మినహా ఫిజికల్ బాడీలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ బైక్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.1.40 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. యమహా ఎఫ్‌జెడ్‌– ఎక్స్‌.. వచ్చే నెలలో భారతీయ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.