యమహా వాహనాలకు ఉచిత చెకప్‌‌

యమహా వాహనాలకు ఉచిత చెకప్‌‌

చెన్నై: వర్షాకాలం టూవీలర్లకు పలు సమస్యలు వస్తాయి కాబట్టి తమ వాహనదారుల కోసం ఉచితంగా ‘ప్రి మాన్‌‌సూన్‌‌ చెకప్‌‌’ శిబిరాలను నిర్వహిస్తున్నట్టు యమహా మోటార్‌‌ ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌ ప్రకటించింది. దేశవ్యాప్తంగా యమహా డీలర్‌‌షిప్‌‌ కార్యాలయాల్లో జూన్‌‌ నెలంతా మెకానిక్‌‌లు చెకప్‌‌లు నిర్వహిస్తారు. వాహనానికి 14 కీలక పరీక్షలు చేస్తారు. ఈ సందర్భంగా హెల్మెట్లు, విడిభాగాలు, లేబర్‌‌ చార్జీలపై ప్రత్యేక డిస్కౌంట్లు ఇస్తారు.  వాహనాలు  సురక్షితంగా ఉండాలనే ఆలోచనతో ఉచిత సర్వీస్‌‌ క్యాంపులు నిర్వహిస్తున్నామని కంపెనీ తెలిపింది.