హైదరాబాద్, వెలుగు : షావోమీ ఇండియా గేమింగ్, మ్యూజిక్లవర్స్ కోసం డెవెలప్ చేసిన రెడ్మీ కే50ఐ ఫోన్‌ను హైదరాబాద్ మార్కెట్లో లాంచ్ చేసింది. మొబైల్ రిటైల్ చెయిన్సెల్బేలో వీటి అమ్మకాలు ఆదివారం నుంచి మొదలవుతాయి. హైదరాబాద్ కె.పి.హెచ్.బి లోని సుజనా ఫోరం మాల్ లో జరుగుతున్న లైవ్ ఎక్స్ ట్రీమ్ లో భాగంగా షావోమీ జోనల్ మేనేజర్ శివేందర్ సింగ్, తెలంగాణ హెడ్ అన్వ ర్, సెల్‌బే మేనేజింగ్ డైరెక్టర్ సోమ నాగరాజు, డైరెక్టర్ సుహాస్ నల్లచెరు కలిసి ఈ డివైజ్ను శనివారం లాంచ్ చేశారు.
ఈ సందర్బంగా సెల్‌బే ఎండీ నాగరాజు మాట్లాడుతూ ఎప్పటికప్పుడు మారుతున్న ట్రెండ్ కు అనుగుణంగా షావోమీ వినూత్న ఫీచర్స్ తో విభిన్నమైన స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నదని అన్నారు. ఇందులో భాగంగా సిటీ మార్కెట్లోకి షావోమీ రెడ్మీ కే50ఐ అందుబాటులోకి రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ ఫోన్లో మ్యూజిక్లవర్స్ కోసం డాల్బీ స్పీకర్స్ ఉన్నాయని చెప్పారు. సెల్‌బే షోరూమ్ల ద్వారా తమ కస్టమర్లకు ఎల్లప్పుడు కొత్త కొత్త , క్వాలిటీ ప్రొడక్టులు అందజేస్తున్నామని వివరించారు. సెల్ బే డైరెక్టర్ సుహాస్ మాట్లాడుతూ ఈ ఫోన్ చాలా వేగంగా పనిచేస్తుందని చెప్పారు.
