WPL 2025: ఆర్సీబీతోనే మంధాన.. మహిళల రిటెన్షన్ జాబితా విడుదల

భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ).. ఐపీఎల్ పురుషుల లీగ్ తరహాలో విమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL)ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ మహిళా లీగ్ రాబోవు ఎడిషన్ కోసం ఆయా ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాలను ప్రకటించాయి. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) సహా మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తమకు అవసరమైన ప్లేయర్లను అంటిపెట్టుకుని.. మిగిలిన వారిని వేలంలోకి వదిలేశాయి.

WPL 2025 రిటెన్షన్ లిస్ట్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: 

స్మృతి మంధాన(కెప్టెన్), సబ్బినేని మేఘన, రిచా ఘోష్, ఎల్లిస్ పెర్రీ, జార్జియో వేర్‌హమ్, శ్రేయాంక పాటిల్, ఆషా శోభన, సోఫీ డివైన్, రేణుకా సింగ్, సోఫీ మోలినక్స్, ఎక్తా బిష్త్, కేట్ క్రాస్, కనికా అహుజా.

మిగిలిన పర్సు వాల్యూ: రూ. 3.25 కోట్లు

ముంబై ఇండియన్స్: 

అమంజోత్ కౌర్, అమేలియా కెర్, క్లో ట్రయాన్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), హేలీ మాథ్యూస్, జింటిమణి కలిత, నాట్ స్కివర్-బ్రంట్, పూజా వస్త్రాకర్, సైకా ఇషాక్, యాస్తికా భాటియా, షబ్నిమ్ ఇస్మాయిల్, ఎస్ సజన, అమన్‌దీప్ కౌర్, కీర్తన బాలకృష్ణన్.

మిగిలిన పర్సు వాల్యూ: రూ. 2.65 కోట్లు

గుజరాత్ జెయింట్స్: 

ఆష్లీ గార్డనర్, బెత్ మూనీ, దయాళన్ హేమలత, హర్లీన్ డియోల్, లారా వోల్వార్డ్, షబ్నమ్ షకీల్, తనూజా కన్వర్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, మేఘనా సింగ్, కష్వీ గౌతమ్, ప్రియా మిశ్రా, మన్నత్ కశ్యప్, సయాలీ సత్గారే.

మిగిలిన పర్సు వాల్యూ: రూ. 4.4 కోట్లు

ఢిల్లీ క్యాపిటల్స్: 

అలిస్ క్యాప్సే, అరుంధతీ రెడ్డి, జెమిమా రోడ్రిగ్స్, జెస్ జోనాస్సెన్, మారిజానే కాప్, మెగ్ లానింగ్, మిన్ను మణి, రాధా యాదవ్, షఫాలీ వర్మ, శిఖా పాండే, స్నేహ దీప్తి, తానియా భాటియా, టిటాస్ సాధు, అన్నాబెల్ సదర్లాండ్.

మిగిలిన పర్సు వాల్యూ: రూ. 2.5 కోట్లు

యూపీ వారియర్జ్:

అలిస్సా హీలీ, అంజలి సర్వాణి, దీప్తి శర్మ, గ్రేస్ హారిస్, కిరణ్ నవ్‌గిరే, చమరి అతపత్తు, రాజేశ్వరి గయాక్‌వాడ్, శ్వేతా సెహ్రావత్, సోఫీ ఎక్లెస్‌స్టోన్, తహ్లియా మెక్‌గ్రాత్, వృందా దినేష్, పూనమ్ థేమ్నార్, సాయ్ ఖేమ్నార్. 

మిగిలిన పర్సు వాల్యూ: రూ. 3.9 కోట్లు