ప్రపంచ సికిల్ సెల్ అవేర్‌నెస్ డే 2023 : వారసత్వంగా వచ్చే ఈ జన్యు రుగ్మత లక్షణాలు, నివారణ

ప్రపంచ సికిల్ సెల్ అవేర్‌నెస్ డే 2023 : వారసత్వంగా వచ్చే ఈ జన్యు రుగ్మత లక్షణాలు, నివారణ

సికిల్ సెల్ వ్యాధి గురించి అవగాహన కల్పించేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు జూన్ 19న ప్రపంచ సికిల్ అవేర్‌నెస్ డేని పాటిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది జన్యుపరమైన రక్త రుగ్మత. ఇది వివిధ ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. డిసెంబర్ 22, 2008న, ప్రపంచ సికిల్ సెల్ అవేర్‌నెస్ డేను యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ తీర్మానించింది, జూన్ 19 ప్రపంచ ఆరోగ్య ఆందోళనపై అవగాహన పెంచడానికి అధికారిక దినంగా గుర్తించబడింది. 

సికిల్ సెల్ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని ప్రభావితం చేస్తుంది, ముఖ్యంగా మధ్యధరా, దక్షిణాసియా, ఆఫ్రికన్, మధ్యప్రాచ్య సంతతికి చెందిన వారిని. ఇది ప్రధానంగా ప్రజారోగ్య సమస్య; అందువల్ల, అవగాహన పెంచడానికి ప్రపంచ సికిల్ సెల్ డే ను జరుపుతున్నారు. ఈ వ్యాధి బారిన పడకుండా ఉండటానికి, వ్యాధికి కారణమేమిటి, లక్షణాలు, దీన్ని ఎలా నివారించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

సికిల్ సెల్ వ్యాధికి కారణాలు

ఇది జీవసంబంధమైన తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వస్తుంది. శరీరం హిమోగ్లోబిన్‌ను ఉత్పత్తి చేయడాన్ని సూచించే జన్యువులో మార్పు వల్ల సికిల్ సెల్ వ్యాధి వస్తుంది. ఈ సమస్య వల్ల కొడవలి ఆకారాన్ని కలిగి ఉండే ఎర్ర రక్త కణాలు రక్తనాళాల్లో అడ్డంకులను ఏర్పరుస్తాయి. RBSలను గట్టిగా, జిగటగా చేసే అసాధారణ హిమోగ్లోబిన్ స్థాయి కారణంగా ఇది కొడవలి ఆకారాన్ని కలిగి ఉంటుంది.

సికిల్ సెల్ వ్యాధి యొక్క లక్షణాలు

రక్తహీనత: హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉండటం వల్ల సికిల్ సెల్ అనీమియా వస్తుంది. ఇదే సికిల్ సెల్ వ్యాధి తీవ్రమైన రూపం. ఇది అలసటను కలిగిస్తుంది.

తక్కువ రోగనిరోధక శక్తి: సికిల్ సెల్ వ్యాధి ప్లీహాన్ని దెబ్బతీయడం ద్వారా సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతుంది.

కంటి సమస్య: సికిల్ సెల్ రక్త ప్రవాహానికి అంతరాయం కలిగించడం వల్ల దృష్టి సమస్యలను కలిగిస్తుంది.

శరీరంలో నొప్పులు: కొడవలి ఆకారపు కణాలు ఉదరం, ఛాతీ, శరీరంలోని ఇతర భాగాలకు రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. ఫలితంగా ఇది తీవ్రమైన శరీర నొప్పులకు దారితీస్తుంది.

వాపు: సికిల్ సెల్ వ్యాధి వల్ల రక్తం ప్రవహించకపోవడం వల్ల చేతులు, కాళ్లలో వాపు వస్తుంది.

నివారణ

ఎవరైనా సికిల్ సెల్ లక్షణాలను కలిగి ఉంటే గనక ఈ వ్యాధి తీవ్రంగా మారకుండా నిరోధించడం ఉత్తమ. సాధారణ చికిత్స కోసం మంచి వైద్యున్ని సంప్రదించడం చాలా మంచిది. సమయానికి తినడం, కనీసం 10 గ్లాసుల నీరు త్రాగడం, టీకాలు వేయించుకోవడం, వ్యాయామాలు చేయడం, మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం ద్వారా సికిల్ సెల్ వ్యాధి బారిన పడకుండా నిరోధించవచ్చు.