World Chess Championship 2024: ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌ విజేత గుకేష్

వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్ 2024 విశ్వ విజేతగా భారత గ్రాండ్‌ మాస్టర్ దొమ్మరాజు గుకేష్ నిలిచాడు. ఫైనల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌, చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించి ట్రోఫీ చేజిక్కించుకున్నాడు. ఈ విజయంతో గుకేష్ ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌ గెలిచిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. 

నిజానికి బుధవారమే ఫలితం తేలాల్సింది. కానీ, ఇద్దరూ విజయం కోసం నువ్వా.. నేనా అన్నట్లు పోరాడటంతో గురువారం వరకు సాగింది. 13వ గేమ్‌ ముగిసే వరకూ ఇద్దరు ఆటగాళ్లు 6.5-6.5 పాయింట్లతో సమానంగా ఉన్నారు. గురువారం జరిగిన చివరి (14వ) గేమ్‌లో డింగ్ లిరెన్ తప్పిదం చేయడంతో గుకేష్ 7.5 పాయింట్లు సాధించి ఛాంపియన్‌గా నిలిచాడు.

రెండో భారతీయుడు 

వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్  గెలిచిన రెండవ భారతీయుడు.. గుకేష్. గతంలో లెజెండరీ చెస్ స్టార్ విశ్వనాథన్ ఆనంద్ వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్ విజేతగా నిలిచారు. ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన ఆనంద్ చివరిసారిగా 2013లో ప్రపంచ చెస్ కిరీటాన్ని గెలుచుకున్నారు.

ALSO READ | Niroshan Dickwella: నిర్దోషి అని నిరూపించుకున్నాడు: శ్రీలంక క్రికెటర్‌పై నిషేధం ఎత్తివేత