కరోనా వైరస్ సంక్షోభంతో సతమతమవుతున్న భారత్ కు వరల్డ్ బ్యాంకు అండగా నిలిచింది. భారత్ కు ఆర్థికసాయం చేసేందుకు ప్రపంచ బ్యాంకు గ్రీన్ సిగ్నలిచ్చింది. భారత్ కు నిధులు విడుదల చేయాలన్న ప్రతిపాదనకు బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు అంగీకరించింది. దీంతో భారత్ కు రూ.3,640 కోట్ల ఆర్థికసాయం అందించాలని నిర్ణయించింది. అయితే.. ఈ నిధులను భారత్ లోని మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ (MSME) రంగం అభివృద్ధికి ఖర్చు చేయాలని ప్రపంచ బ్యాంకు సూచించింది.
2020 ప్రారంభంలో భారత్ లో ప్రవేశించిన కరోనా ప్రజల ఆరోగ్యంతో పాటు MSME రంగాన్ని కూడా అతలాకుతలం చేసింది. ఈ క్రమంలో 5.55 లక్షల వ్యాపార సంస్థలు ప్రభుత్వ సాయం పొందుతున్నాయి. కరోనా పరిస్థితుల్లో MSME ల పునరుద్ధరణకు ప్రపంచబ్యాంకు నిధులు ఉపయోగపడుతాయని భావిస్తున్నారు.
