విజయం సాధించేవరకు ఢిల్లీ సరిహద్దుల నుంచి కదిలేది లేదని, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటామని భారతీయ కిసాన్ యూనియన్ లీడర్ రాకేష్ తికాయత్ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్‌లో నిర్వహించిన కిసాన్ మహాపంచాయత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అవసరమైతే ప్రాణాలు కూడా వదిలేస్తామని, తమ పోరాటంలో వెనక్కి తగ్గబోమని, ఇక్కడే సమాధి కావడానికి కూడా భయపడబోమని చెప్పారు. ప్రభుత్వం చర్చలకు పిలిస్తే తప్పకుండా వెళ్తామన్నారు. డిమాండ్లు నెరవేర్చెవరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. మన దేశానికి స్వాతంత్ర్యం రావడానికి 90 ఏళ్లు పోరాడాల్సి వచ్చిందని, ఈ రైతు పోరాటం కూడా అంత సుదీర్ఘంగా సాగినా వెనుకాడేది లేదని తికాయత్ చెప్పారు.
దేశంలో 14 కోట్ల మంది యువతకు నిరుద్యోగులుగా ఉన్నారన్నారు తికాయత్. మోడీ సర్కార్ ఒక్క దాన్ని అమ్ముకుంటూ పోతోందన్నారు. కరెంట్ ను ప్రైవేటైజ్ చేస్తున్నారని ఆరోపించారు. రైళ్లు, ఎయిర్ పోర్టులు, రోడ్లు అమ్ముకుంటున్నారని చెప్పారు.
