ఆర్టికల్ 370ని పునరుద్ధరించేంత వరకు పోటీ చేయను

ఆర్టికల్ 370ని పునరుద్ధరించేంత వరకు పోటీ చేయను
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌‌లో రీసెంట్‌‌గా జరిగిన డిస్ట్రిక్ట్ డెవలప్‌‌మెంట్ కౌన్సిల్ (డీడీసీ) ఎన్నికల్లో గుప్కర్ కూటమి విజయం సాధించింది. 20 జిల్లాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో గుప్కర్ అలయెన్స్ 13 జిల్లాల్లో విక్టరీ కొట్టింది. జమ్మూలో 6 జిల్లాల్లో బీజేపీ గెలిచింది. ఈ కూటమిలో నేషనల్ కాన్ఫరెన్స్‌‌తోపాటు కాంగ్రెస్, పీడీపీ లాంటి పార్టీలు ఉన్నాయి. ఈ ఫలితాలపై జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ స్పందించారు. ఆర్టికల్ 370ని రద్దు చేసేంత వరకు తాను ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని ముఫ్తీ స్పష్టం చేశారు. ‘జమ్మూ కశ్మీర్ ఆర్టికల్ 370ని, సొంత రాజ్యాంగాన్ని పునరుద్ధరించేంత వరకు అసెంబ్లీ ఎన్నికలతోపాటు ఇతర ఏ ఎలక్షన్స్‌‌లోనూ నేను పోటీచేయబోను. నేషనల్ కాన్ఫరెన్స్ లాంటి పార్టీలతో కలసి అలయెన్స్‌‌ను ఏర్పాటు చేయడం వెనుక బలమైన కారణం ఉంది. ఆర్టికల్ 370 పునరుద్ధరణ కోసం కలిశాం. కశ్మీరీలం కాబట్టి శత్రువులైనప్పటికీ కలిశాం. ప్రధాని మోడీతో మేం ఎప్పటికీ చేతులు కలపబోం’ అని ముఫ్తీ పేర్కొన్నారు.