Women's T20 World Cup 2024: సెమీస్‌కు వేళాయె.. షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు

మహిళల టీ20 ప్రపంచకప్‌లో నాకౌట్ సమరానికి ఆసన్నమైంది. బుధవారం (అక్టోబర్ 17) నుంచి సెమీఫైనల్ మ్యాచ్‌లు షురూ కానున్నాయి.  మొదటి సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడనుండగా.. రెండో సెమీఫైనల్‌లో వెస్టిండీస్, న్యూజిలాండ్ జట్లు అమీ తుమీ తేల్చుకోనున్నాయి. 

ట్రోఫీ ఎవరిది..?

పై నాలుగింటిలో ఆస్ట్రేలియా బలమైన జట్టుగా చెప్పుకున్నప్పటికీ, మిగిలిన మూడు జట్లను తేలిగ్గా కొట్టి పారేయలేం. పటిష్ట ఇంగ్లండ్‌ను మట్టికరిపించి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్న  వెస్టిండీస్ వనితలు మూడోసారి పొట్టి ప్రపంచకప్ ట్రోఫీ చేజిక్కించుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఇక ప్రారంభ పోరులో భారత్‌ను ఓడించిన న్యూజిలాండ్.. టోర్నీ అమాంతం నిలకడగా రాణిస్తున్న దక్షిణాఫ్రికా జట్లు ఒకసారైన విశ్వవిజేతగా నిలవాలని చూస్తున్నాయి. దాంతో, ట్రోఫీ ఎవరిదని చెప్పడం కష్టంతో కూడుకున్నదే. 

షెడ్యూల్

  • సెమీఫైనల్ 1(అక్టోబర్ 17): ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా (దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం) 
  • సెమీఫైనల్ 2(అక్టోబర్ 18): వెస్టిండీస్ vs న్యూజిలాండ్ (షార్జా క్రికెట్ స్టేడియం)
  • ఫైనల్ (అక్టోబర్ 20): సెమీఫైనల్ 1 విజేత vs సెమీఫైనల్ 2 విజేత (దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం)

లైవ్ స్ట్రీమింగ్ వివరాలు

సెమీ-ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లు టీవీలో స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్‌డి, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ హెచ్‌డి  ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయి. డిజిటల్‌గా డిస్నీ+ హాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్‌లో లైవ్ ఆస్వాదించవచ్చు. DD స్పోర్ట్స్ ఫ్రీ-టు-ఎయిర్ ఛానెల్‌లోనూ ప్రత్యక్ష ప్రసారాలు ఉన్నాయి.

ALSO READ | DK: ఐపీఎల్‌కు రిటైర్మెంట్.. అబుదాబి లీగ్‌లో అరంగ్రేటం