విమెన్స్ టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌లో బంగ్లా శుభారంభం

షార్జా :  విమెన్స్ టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌లో బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ శుభారంభం చేసింది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో  బ్యాటింగ్, బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో రాణించి స్కాట్లాండ్‌‌‌‌‌‌‌‌ పని పట్టింది. గురువారం జరిగిన గ్రూప్‌‌‌‌‌‌‌‌–బి పోరులో బంగ్లా 16 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో గెలిచింది. తొలుత టాస్ నెగ్గి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ నిర్ణీత 20 ఓవర్లలో 119/7 స్కోరు చేసింది. శోభన మొస్తరీ (36) టాప్‌‌‌‌‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా  నిలవగా.. శతి రాణి (29), కెప్టెన్ నిగర్ సుల్తానా (18) ఫర్వాలేదనిపించారు. 

స్కాటిష్ బౌలర్లలో  సస్కియా హోర్లే మూడు వికెట్లు పడగొట్టింది. అనంతరం ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో స్కాట్లాండ్‌‌‌‌‌‌‌‌  20 ఓవర్లలో 103/7 స్కోరు చేసి ఓడిపోయింది. ఓపెనర్  సారా బ్రైస్ (49 నాటౌట్‌‌‌‌‌‌‌‌) ఒంటరి పోరాటం చేయగా.. మిగతా బ్యాటర్లంతా నిరాశ పరిచారు.  రెండు వికెట్లు పడగొట్టిన రితు మోనికి ప్లేయర్ ఆఫ్ ద  మ్యాచ్ అవార్డు లభించింది. 

లంకపై పాక్ గెలుపు

గ్రూప్‌‌‌‌‌‌‌‌–ఎలో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ 31 రన్స్ తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. తొలుత పాక్ 20 ఓవర్లలో 116 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. కెప్టెన్​ ఫాతిమా సనా (20 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌తో 30 నాటౌట్), నిదా దర్ (23) రాణించారు. 

ALSO READ | ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో.. ఖుషికి కాంస్యం

లంక బౌలర్లలో చమారి ఆటపట్టు, సుగందిక, ఉదేషిక తలో మూడు వికెట్లు పడగొట్టారు. ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో లంక ఓవర్లన్నీ ఆడి 85/9 స్కోరుకే పరిమితమైంది.  నిలక్షణ సిల్వ (22), విష్మి గుణరత్నె (20) తప్ప మిగతా బ్యాటర్లు ఫెయిలయ్యారు.  సాదియా ఇక్బాల్ మూడు, ఫాతిమా సనా, ఒమైమా, నిష్రా తలో రెండు వికెట్లు తీశారు. ఫాతిమా సనాకు ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.