షార్జా: బ్యాటింగ్‌లో డానీ వ్యాట్ (41), మయా బౌచిర్ (23) రాణించడంతో.. విమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ తొలి విజయాన్ని నమోదు చేసింది. బౌలర్లు కూడా రాణించడంతో.. శనివారం జరిగిన గ్రూప్–బి మ్యాచ్‌లో ఇంగ్లండ్ 21 రన్స్ తేడాతో బంగ్లాదేశ్‌పై నెగ్గింది.
టాస్ గెలిచిన ఇంగ్లీష్ టీమ్ 20 ఓవర్లలో 118/7 స్కోరు చేసింది. బౌచిర్, వ్యాట్ తొలి వికెట్‌కు 48 రన్స్ జోడించారు. మధ్యలో అమీ జోన్స్ (12) మెరిసినా మిగతా వారు నిరాశపర్చారు. నహీదా అక్తర్, ఫహిమా ఖాతున్, రితూ మోనీ తలా రెండు వికెట్లు తీశారు. తర్వాత బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 97/7 స్కోరుకే పరిమితమైంది. శోభన మూస్ట్రే (44) టాప్ స్కోరర్. స్మిత్, డీన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. వ్యాట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
England start with a W ???????
— ESPNcricinfo (@ESPNcricinfo) October 5, 2024
SCORECARD: https://t.co/axBSfEMZNU | #T20WorldCup pic.twitter.com/K7GYfAuKTT