Women's T20 World Cup 2024: టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌.. సౌతాఫ్రికా బోణీ

దుబాయ్‌‌‌‌‌‌‌‌: బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో రాణించిన సౌతాఫ్రికా.. విమెన్స్‌‌‌‌‌‌‌‌ టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌లో బోణీ చేసింది. టార్గెట్‌‌‌‌‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో లారా వోల్‌‌‌‌‌‌‌‌వర్త్‌‌‌‌‌‌‌‌ (59 నాటౌట్‌‌‌‌‌‌‌‌), తజ్మిన్‌‌‌‌‌‌‌‌ బ్రిట్స్‌‌‌‌‌‌‌‌ (57 నాటౌట్‌‌‌‌‌‌‌‌) చెలరేగడంతో.. శుక్రవారం జరిగిన గ్రూప్‌‌‌‌‌‌‌‌–బి తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో సౌతాఫ్రికా 10 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌ను చిత్తు చేసింది. టాస్ ఓడిన విండీస్‌‌‌‌‌‌‌‌ 20 ఓవర్లలో 118/6 స్కోరు చేసింది. స్టెఫానీ టేలర్‌‌‌‌‌‌‌‌ (44 నాటౌట్‌‌‌‌‌‌‌‌) టాప్‌‌‌‌‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌. మలాబా 4, కాప్‌‌‌‌‌‌‌‌ 2 వికెట్లు తీశారు. సౌతాఫ్రికా 17.5 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 119/0 స్కోరు చేసింది. మలాబాకు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది.