నీళ్ల కోసం కొట్లాట.. బిందెతో కొట్టడంతో మహిళ మృతి

నీళ్ల కోసం కొట్లాట.. బిందెతో కొట్టడంతో మహిళ మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. సోంపేట మండల కేంద్రంలోని చిన్నపల్లి వీధిలో తాగునీటి నల్లా దగ్గర జరిగిన గొడవ ఓ మహిళ ప్రాణం తీసింది. గ్రామంలో తాగునీటి కోసం కుళాయి దగ్గరకు వెళ్లిన పద్మ అనే మహిళ క్యూలో నిల్చుంది. అయితే వరుస తప్పడంతో…ముందున్న మహిళలు పద్మతో గొడవకు దిగారు. మాటామాటా పెరగడంతో..తోపులాట జరిగి ఒకరినొకరు బిందెలతో కొట్టుకున్నారు. ఈ ఘటనలో పద్మ… తల భాగంలో తీవ్రగాయాలు కావడంతో…ఆమె అక్కడికక్కడే చనిపోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని… విచారణ చేస్తున్నారు.