ఖాళీ బిందెలతో మహిళల ఆందోళన

మహబూబ్ నగర్ టౌన్ , వెలుగు: జిల్లా కేంద్రంలోని బోయపల్లి వార్డులో వారం రోజులుగా మిషన్  భగీరథ నీళ్లు  రావడం లేదని ఆరోపిస్తూ బుధవారం కాలనీ మహిళలు ఖాళీ బిందెలతో ప్రధాన రోడ్డుపై రాస్తోరోకో చేశారు. నీళ్లు రావడం లేదని మున్సిపల్  అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని వాపోయారు. నీళ్ల కోసం తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. గంట పాటు ఆందోళన చేయడంతో వాహనాలు నిలిచిపోయాయి. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని మున్సిపల్​ ఆఫీసర్లు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.