2024 ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావటమే లక్ష్యంగా పావులు కదుపుతున్న జగన్ అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల తుది జాబితా ప్రకటించాడు. ఈ క్రమంలో ఒక ఆసక్తికర అంశం తెరమీదకు వచ్చింది. అదేంటంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణలకు పోటీగా వైసీపీ తరఫున మహిళా అభ్యర్థులు బరిలో నిలవటం. ఇది జగన్ ప్లాన్ లో భాగమా లేక కోఇన్సిడెన్సా అన్న చర్చ మొదలైంది.
పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నుండి వంగా గీత, హిందూపురంలో బాలకృష్ణకు పోటీగా టీఎన్ దీపిక, మంగళగిరిలో లోకేష్ కు పోటీగా మురుగుడు లావణ్యలను బరిలో దింపాడు జగన్. కీలక నేతలపై మహిళా అభ్యర్థులను పోటీకి దింపటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పవన్ కళ్యాణ్, లోకేష్, బాలకృష్ణలను ఓడించటమే లక్ష్యంగా ఆయా నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన జగన్ ఆ వ్యూహంలో భాగంగానే మహిళా అభ్యర్థులను బరిలో దింపినట్లు తెలుస్తోంది. మరి, జగన్ వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా వేచి చూడాలి.