Women Beauty : ఈ పండ్లతో ఫేస్ మసాజ్.. ఆ తర్వాత మీ ముఖం నిగనిగలాడుతోంది..!

ఫ్రూట్స్... ముఖ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తాయి. అందుకే చర్మ  నిగారింపుని కాపాడేందుకు క్రమం తప్పకుండా ఫ్రూట్స్ తో మసాజ్ చేయాలి. ఇందుకోసం ప్రతిరోజు పార్లర్కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఫ్రూట్స్  తో  మసాజ్ క్రీమ్స్ తయారుచేసుకుని చర్మాన్ని కాపాడుకోవచ్చు. ఇంతకీ ఆ క్రీమ్స్ ఏంటి? వాటిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. . .

బొప్పాయి క్రీమ్ తయారీకి కావాల్సినవి

  • బొప్పాయి ముక్కలు-.. ఒక టేబుల్ స్పూన్
  •  ఆరెంజ్ సైస్-.. ఒకటి
  •  నల్ల ద్రాక్ష లేదా స్ట్రాబెరీ-..రెండు 
  • విటమిన్  -ఇ క్యాప్సిల్స్..   ఒకటి 
  • కలబంద గుజ్జు- ...రెండు టీ స్పూను
  •  తేనె- ..ఒక టీస్పూన్

తయారీ విధానం:  మిక్సీ జార్లో బొప్పాయి ముక్కలు, ఆరెంజ్, ద్రాక్ష వేసి మిక్సీ పట్టి మెత్తని పేస్ట్ చేసి గిన్నెలోకి తీయాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకుని అందులో కలబంద గుజ్జు, విటమిన్- ఇ క్యాప్సుల్ లిక్విడ్ వేయాలి. తర్వాత అందులో తేనె కూడా వేసి బాగా గిలక్కొట్టాలి. ఆమిశ్రమాన్ని కేంద్ర పేస్ట్ లో వేసి బాగా కలిపి డబ్బాలోకి తీసుకోవాలి ఆ డబ్బాను ఐదు నుంచి  ఆరురోజులు ఫ్రిజ్ లో  పెట్టాలి. కావాల్సినప్పుడు మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని ముఖానికి, చేతులకి రాసుకొని వది నుంచి పదిహేను నిమిషాల పాటు మసాజ్ చేయాలి. మసాజ్ చేసిన తర్వాత చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. విటమిన్- ఇ చర్మాన్ని కాంతివంతగా ఉం చుతుంది. అంతేకాదు చర్మాన్ని సూర్యకాంతి నుంచి కూడా రక్షిస్తుంది. కంటి కింద నల్లటి వలయాలను ముఖంపై మచ్చలను కూడా విటమిన్- ఇ తగ్గిస్తుంది. ఈక్రీమ్ వారానికి ఒకసారి మసాజ్ చేసుకుంటే మంచిఫలితం ఉంటుంది. ఈ క్రీమ్ మెడ చేతులు, కాళ్లకు కూడా రాసుకోవచ్చు.

ALSO READ | Good Health : ఏ పండు.. ఎలాంటి ఆరోగ్యాన్ని ఇస్తుంది.. హెల్దీ ఫ్రూట్స్ ఇవే..!

బనానా, మ్యాంగో క్రీమ్ తయారీకి కావలసినవి

  • మిల్క్ క్రీమ్-..ఒక టీ స్పూన్,
  •  అరటి వండు ముక్కలు - ..ఒక టీ స్పూన్
  •  మామిడి పండు ముక్కలు..-రెండు టీ స్పూన్లు 
  • విటమిన్- ఇ ఆయిల్-... నాలుగు చుక్కలు

తయారీ విధానం : మిక్సీజార్లో మిల్క్ క్రీమ్. అరటి పండు, మామిడి ముక్కలు విటమిన్ -ఇ ఆయిల్ వేసి మిక్సీ పట్టాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని బౌల్ లోకి తీసుకుని ముఖం. మెద భాగాలకు రాసి వది నిమిషాలు మసాజ్ చేయాలి. ఇలా వారానికి  ఒకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 

నేరేడు క్రీమ్ తయారీకి కావలసినవి

  • నేరేడు పండ్ల పేస్ట్-.. ఒక టీ స్పూన్ 
  • పెరుగు -.. ఒక టీ స్పూన్,
  •  తేనె- ..ఒక టేబుల్ స్పూన్

తయారీ విధానం : నేరేడు పండుని మెత్తని పేస్ట్ చేయాలి. అందులో పెరుగు, తేనె వేసి బాగా గిలక్కొట్టాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి మృదువుగా పది నుంచి పదిహేను నిమిషాల పాటు మసాజ్ చేసి వదిలేయాలి. ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. పెరుగు చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి డెడ్ స్క్రీన్ ని తొలగించి క్లెన్వర్ గా పనిచేస్తుంది. అంతేకాదు పెరుగు మొటిమలు, మచ్చలకు కూడా చెక్ పెడుతుంది. అలాగే తేనెలోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలను తొలగిస్తాయి.

కివి ఫ్రూట్ క్రీమ్ తయారీకి కావలసినవి

  • కివి (తొక్క తీసి)- ఒకటి 
  • పెరుగు... - రెండు టేబుల్ స్పూన్లు
  •  తేనె.. - ఒక టేబుల్ స్పూన్ 
  • ఆల్మండ్ ఆయిల్ -... ఒక టేబుల్ స్పూన్ 
  • ఆల్మండ్ గింజల పొడి - ,,,ఒకటీస్పూన్

తయారీ విధానం : మిక్సీజార్ లో కివి, తేనె, ఆల్మండ్ ఆల్మండ్ అయిల్, పెరుగు వేసి ఒక నిమిషం మిక్సీలో గ్రైండ్ చేయాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని బౌల్ లోకి తీసుకుని ముఖం మీద భాగాలకు రాయాలి. ఐదునిమిషాల తర్వాత వేళ్లతో నెమ్మదిగా పావుగంట మసాజ్ చేయాలి తర్వాత చల్లటి నీళ్లతో శుభ్రం చేయాలి. ఇలా  వారానికి ఒకసారి చేస్తే చర్మం మెరుస్తుంది. 

-వెలుగు.. లైఫ్--