బిజినెస్ డెస్క్, వెలుగు: ఆర్థిక పరమైన అంశాల్లో మహిళలు ఇండిపెండెంట్‌గా నిర్ణయాలు తీసుకోవడం పెరుగుతోంది. పర్సనల్ ఫైనాన్స్‌లో, వెల్త్‌ను క్రియేట్ చేసుకోవడంలో సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఆన్‌లైన్ వెల్త్ మేనేజ్‌మెంట్ కంపెనీ స్క్రిప్‌బాక్స్ చేసిన సర్వే ప్రకారం, స్వతహాగా ఆర్థికపరమైన నిర్ణయాలను తీసుకోవడానికి 70 శాతం మంది రెస్పాండెంట్లు ఆసక్తి చూపించారు. ఫైనాన్షియల్ ప్లాన్ ఉండాల్సిన అవసరం ఉందని 44 శాతం మంది అభిప్రాయపడ్డారు. సేవింగ్స్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామని 40 శాతం మంది, తమ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను పెంచుతామని 23 శాతం మంది రెస్పాండెంట్లు వివరించారు. కరోనా టైమ్‌లో మొదటిసారిగా ఇన్వెస్ట్‌మెంట్ బాట పట్టిన వారు పెరిగారు. ఈ సర్వే ప్రకారం, దేశంలోని ప్రతి ఐదు మంది మహిళలలో ఒకరు కరోనా సంక్షోభం టైమ్‌లోనే మొదటిసారిగా ఇన్వెస్ట్‌మెంట్ల వైపు చూశారు. కరోనా సంక్షోభం తర్వాత మహిళలు తమ మనీని సొంతంగా మేనేజ్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారని ఈ సర్వే పేర్కొంది. దేశం మొత్తం మీద 750 మంది మహిళల అభిప్రాయాలను ఆన్‌లైన్ ద్వారా సేకరించి ఈ సర్వేను స్క్రిప్‌బాక్స్ విడుదల చేసింది. గూర్గాన్ మామ్స్ వంటి కమ్యూనిటీ ప్లాట్‌ఫామ్‌ల నుంచి కూడా మహిళల అభిప్రాయాలను ఈ సంస్థ సేకరించింది.
లాంగ్‌టెర్మ్ గోల్స్‌కు ప్రయారిటీ..
ఈ సర్వేలో పాల్గొన్న మహిళల్లో 20 శాతం మంది రిటైర్‌మెంట్ కోసం డబ్బులు సేవ్ చేయాలని అనుకుంటున్నారు. మరో 20 శాతం మంది పిల్లల చదువుల కోసం డబ్బులు దాయాలని ప్లాన్స్ వేసుకుంటున్నారు. 35 ఏళ్ల లోపు ఏజ్ ఉన్న మహిళలు తమ సంపాదన మరింత పెంచుకోవడానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. 35 ఏళ్లు దాటిన వారు ఎమెర్జెన్సీ ఫండ్‌ను ఏర్పాటు చేసుకోవడానికి ప్రయారిటీ ఇచ్చారు. ఫైనాన్షియల్ మేటర్స్‌ను తమ కంట్రోల్ ఉంచుకోవడం వలన కాన్ఫిడెంట్‌గా, ఇండిపెండెంట్‌గా మారామని 70 శాతం మంది రెస్పాండెంట్లు పేర్కొన్నారు.
రిస్క్‌ను కంట్రోల్‌లో ఉంచుతూనే..
మహిళలు ఇన్వెస్ట్ చేయడం పెరిగినా, రిస్క్‌పై కూడా అంతే జాగ్రత్తగా ఉంటున్నారని స్క్రిప్‌బాక్స్ సర్వే వెల్లడించింది. సర్వేలో పాల్గొన్న వారిలో 22 శాతం మంది మ్యూచువల్ ఫండ్స్‌లలో డబ్బులు పెట్టేందుకు ఎక్కువ ఆసక్తి చూపించారు. ఆ తర్వాత షేర్లలో, గోల్డ్‌లో డబ్బులు పెట్టేందుకు ఆసక్తి చూపించారు. మరో 34 శాతం మంది ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, పీపీఎఫ్, సేవింగ్స్ అకౌంట్ వంటి ట్రెడీషనల్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లలో డబ్బులు పెట్టడానికి మొగ్గు చూపారు. ‘ డబ్బులు మేనేజ్ చేసుకోవడంలో మగవారికి, మహిళలకు మధ్య తగ్గిన అంతరాన్ని ఈ సర్వే హైలైట్ చేసింది. ఆర్థిక పరమైన అంశాల్లో మహిళలు ఇండిపెండెన్స్ పెరగడాన్ని ఈ సర్వే ప్రస్తావించింది. ఫైనాన్షియల్ ప్లానింగ్, వెల్త్ క్రియేట్ చేయడంలో మహిళలకు అవగాహన, ఆసక్తి రెండూ పెరగడంతో వీరి గోల్స్, ఆలోచన విధానాల్లో మార్పు కనిపిస్తోంది. తమ డబ్బులను సేవ్ చేసుకోవడానికి, ఇన్వెస్ట్ చేసుకోవడానికి మహిళలు ఎప్పుడూ లేనంతగా ప్రస్తుతం స్వతహాగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అవసరమైన నిర్ణయాలు తీసుకోవడంలో మహిళలకు సాయం చేస్తున్నాం’ అని స్క్రిప్‌బాక్స్ సీఈఓ, ఫౌండర్ అతుల్ షింఘాల్ పేర్కొన్నారు.
ఈ సారి పెరిగారు..
సర్వేలో పాల్గొన్న వారిలో సుమారు 70 శాతం మంది రెస్పాండెంట్లు తమ డబ్బు లను సొంతంగా మేనేజ్ చేసుకోవడానికి ఇష్టపడ్డారు. ఇందులో 32 శాతం మంది ఇండిపెండెంట్‌గా, మరో 38 శాతం మంది స్పౌజ్‌తో కలిసి తమ ఆర్థిక నిర్ణయాలను తీసుకోవడానికి ఆసక్తి చూపించారు. కిందటేడాది 60 శాతం మంది రెస్పాండెం ట్లు తమ డబ్బులను ఇండిపెండెంట్‌గా లేదా స్పౌజ్‌తో కలిసి ఆర్థిక పరమైన నిర్ణ యాలు తీసుకుంటున్నామని వివరిం చారు. అంతేకాకుండా కిందటేడాదితో పోలిస్తే ఈ ఏడాది సొంతంగా తమ డబ్బులను మేనేజ్ చేసుకుంటున్న మహిళలు 11 శాతం పెరిగారని స్క్రిప్‌బాక్స్ వెల్లడించింది. కేవలం 10 శాతం మంది మాత్రమే లగ్జరీ ప్రొడక్ట్‌లను కొనేందుకు ఆసక్తి చూపించారు.
