అత్యంత కిరాతకం: పిల్లల ముందే మహిళా టీచర్‌పై కత్తితో దాడి.. భయంతో వణికిపోయిన విద్యార్థులు

తమిళనాడు: తంజావూరు జిల్లాలోని మల్లిపట్టినం ప్రభుత్వ పాఠశాలలో ఓ మహిళా టీచర్‌(26) కత్తిపోట్లకు బలైంది. తనతో పెళ్లికి నిరాకరించిందన్న ఆగ్రహంతో మాజీ ప్రియుడే ఆమెను హత్య చేశాడు. బాధితురాలు తరగతి గదిలో పిల్లలకు పాఠాలు చెప్తుండగా.. లోనికి ప్రవేశించిన నిందితుడు విచక్షణా రహితంగా ఆమె మెడపై కత్తితో దాడి చేశాడు.

మెడపై ఏడెనిమిది సార్లు కత్తితో దాడి చేయడంతో టీచర్ ప్రతిఘటించలేక పోయింది. అక్కడిక్కడే రక్తపు మడుగులో కుప్పకూలింది. వెంటనే పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ లాభం లేకపోయింది. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఘటన జరిగిన కొద్ది గంటలకే నిందితుడు మధన్‌కుమార్(30)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

హెచ్చరించిన గ్రామ పెద్దలు

కొన్ని రోజుల క్రితం మధన్‌కుమార్.. రమణి ముందు పెళ్లి ప్రపోజల్ పెట్టగా ఆమె నిరాకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయపై మధన్‌కుమార్, బాధితురాలి కుటుంబసభ్యుల మధ్య గొడవ జరగ్గా.. యువకుడిని గ్రామ పెద్దలు హెచ్చరించినట్లు వెల్లడించారు. దాంతో, పరువు పోయినట్లు భావించిన యువకుడు.. యువతిని అంతమొందించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

ALSO READ | ఏపీలో లా స్టూడెంట్‌పై గ్యాంగ్‌ రేప్‌.. ప్రియుడే స్నేహితులతో కలిసి అఘాయిత్యం