నది ఒడ్డున నిలబడి హాయిగా.. నేచర్‌ని ఎంజాయ్ చేస్తుంటే అబ్బా! భలే ఉంటుంది కదా. అదే టైంలో అనుకోకుండా మొసలి ఎదురైతే. గుండె ఝల్లుమంటుంది. భయంతో తెలియకుండానే కాళ్లు పరుగులు పెట్టేస్తాయి. కానీ, ఒకామె మాత్రం మొసలిని చూసి కనీసం భయపడకుండా ఏం చేసిందో చూడండి. నది ఒడ్డున నిలబడి అక్కడి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తోంది ఒకామె. ఇంతలో ఒక మొసలి తన వైపుకు రావడం గమనించింది. వెంటనే తన కాలికి ఉన్న చెప్పు తీసి, మొసలికి చూపిస్తూ గట్టిగా అరిచింది. ఏమనుకుందో ఏమో గానీ దెబ్బకి మొసలి వెంటనే వెనక్కి తిరిగి నీళ్లలోకి వెళ్లిపోయింది. ఆ విషయాన్ని వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అంత ఫన్నీ వీడియో వస్తే జనాలు ఊరుకుంటారా?. దానికి తెగ కామెంట్లు పెడుతున్నారు. విపరీతంగా షేర్ చేస్తున్నారు. “ ఇంట్లో అమ్మ చెప్పు తీస్తే పరిస్థితి ఏంటో మొసలికి కూడా తెలిసిపోయింది రోయ్’’, “ భర్త లేటుగా వస్తే భయపెట్టి.. భయపెట్టి అలవాటు అయినట్లు ఉంది మేడమ్‌కి”, “ భయపెట్టేందుకు చెప్పును మించిన ఆయుధం మరోటి లేదు” అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే, అది ఎక్కడ జరిగిందనే విషయం మాత్రం క్లారిటీ లేదు.
