పరమ శివుడి ముందే పరాచకాలా.. లవ్ ప్రపోజల్ పై ఆగ్రహం

పరమ శివుడి ముందే పరాచకాలా.. లవ్ ప్రపోజల్ పై ఆగ్రహం

అది గుడి అనుకున్నారా లేక పార్కు అనుకున్నారా.. అక్కడ ఉన్నది పరవ శివుడు అనుకున్నారా లేక రాయి అనుకున్నారా.. ఇంకెక్కడా మీ ప్రేమకు చోటు దొరకలేదా.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కేదార్ నాథ్ ఆలయం ఎదుట ఆ ప్రేమ వ్యవహారాలు ఏంటీ.. మీరు వెళ్లింది గుడికా లేక పార్కుకా.. మీరు, మీ దుస్తులు ఏంటీ అంటూ ఓ జంటపై మండిపడుతున్నారు నెటిజన్లు. ఆ పరమ శివుడి ముందే పరాచకాలు ఆడతారా అంటూ తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. పూర్తి వివరాల్లోకి వెళితే...

వైరల్ అవుతోన్న వీడియోను బట్టి చూస్తే.. ఇది కేథార్ నాథ్ ఆలయ ప్రాంగణంలో జరిగినట్టు తెలుస్తోంది. పసుపు రంగు దుస్తులు ధరించి ఓ యువతీ, యువకుడు ఆలయానికి ఎదురుగా నిలబడి నమస్కరిస్తుండగా.. యువతి వెనుక ఉన్న ఓ వ్యక్తి ఆమెకు రింగ్ బాక్స్ ను అందజేస్తారు. ఆమె రింగ్ బాక్స్ తో  పక్కనే ఉన్న యువకుడి ముందు మోకరిల్లుతుంది. కొన్ని సెకన్ల తర్వాత ఆ వ్యక్తి ఆమెను చూసి ఆశ్చర్యపోతాడు. ఆమె ప్రపోజల్ ను యాక్సెప్ట్ చేసి, హగ్ చేసుకుంటాడు. ఆ తర్వాత కెమెరాకు ఫొజులిస్తారు. ఇదంతా కూడా చుట్టూ భక్తులు, సందర్శకులు ఉండగానే చోటుచేసుకుంది.

ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వెంటనే వైరల్ కావడం ప్రారంభించింది. దీంతో నెటిజన్లు పలు కామెంట్స్ పెడుతూ ఈ వీడియోను మరింత షేర్ చేస్తున్నారు. ఈ ఘటనను కొందరు తేలిగ్గా తీసుకుంటే.. మరికొందరు మాత్రం దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పుణ్య క్షేత్రాలు, దేవాలయాల్లో స్మార్ట్ ఫోన్లను నిషేధించడానికి ఇదీ ఒక కారణమంటూ విమర్శిస్తున్నారు.

https://twitter.com/Ravisutanjani/status/1675117145347481600