తమిళనాడు రాజధాని చెన్నైలో కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు స్థానికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో భాగంగా విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా పోలీసు.. స్పృహ తప్పి పడిపోయిన ఓ యువకుడిని తన భుజాలపై ఆటో వరకు మోస్కెళ్లి..సకాలంలో ఆస్పత్రికి చేరుకునేలా చేసి అందరి మన్ననలు పొందారు.
చెన్నైలో టీపీ చట్రం ఏరియాలోని ఓ శ్మశాన వాటికలో ఉదయ్ కుమార్ అనే యువకుడు స్పృహ తప్పి పడిపోయాడు. అతని శరీరంలో కదలికలను గమనించిన మహిళా సీఐ రాజేశ్వరి వెంటనే ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. అక్కడికి దగ్గరలో ఎలాంటి వెహికిల్ లేక పోవడమంతో..స్వయంగా శ్మశాన వాటిక నుంచి ఆటో వరకు సీఐ రాజేశ్వరి ఉదయ్ కుమార్‌ను తన భుజాలపై మోసుకెళ్లారు. ఆ తర్వాత ఆటోలో ఉదయ్‌ను ఉంచి ఆస్పత్రికి తరలించారు. యువకుడి ప్రాణాలను కాపాడిన సీఐ రాజేశ్వరిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
