ఎక్కువగా ఫోన్లో మాట్లాడుతుందని భార్యని హతమార్చిన భర్త. చివరికి అనుమానం రాకుండా..

హైదరాబాద్​:  భార్యపై అనుమానంతో  కూకట్​పల్లిలో మర్డర్​ చేసి  డెడ్​బాడీని  ఎవరికి అనుమానం రాకుండా అందోల్ కి తరలించాడు.  హెల్త్​ బాగలేక చనిపోయిందని నమ్మించేందుకు  యత్నించాడు.  మృతురాలి కుటుంబీకులు అనుమానంతో నిలదీస్తే  తానే మర్డర్​ చేసిన్నట్లుగా ఒప్పుకున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేటలో చోటుచేసుకుంది. 

అందోల్  చెందిన వెండికోలు నర్సింహులు  రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో  గ్యాస్ డెలివరీ ఏజెంట్  పనిచేస్తున్నాడు.   భార్య  ఇందిర (33)కు  కొన్ని రోజులుగా  ఫోన్ కాల్స్ ఎక్కువగా రావడంపై  నర్సింహులు అనుమానం పెంచుకొని,   కొంతకాలంగా ఇద్దరూ గొడవపడుతున్నారు. ఈ క్రమంలో  కోపాద్రిక్తుడైన అతను టవల్ ను  గొంతుకు చుట్టి ఆమెను  హత్య చేశాడు.  

కూకట్ పల్లి  నుంచి అందోల్ కు డెడ్​బాడీని  తీసుకెళ్లి అనారోగ్యంతో మృతిచెందినట్లుగా చెప్పారు.  మృతురాలి తల్లి మొగులమ్మ పోలీసులకు కంప్లైట్​ చేయగా నర్సింహులుపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని విచారిస్తే నేరం ఒప్పు కున్నట్లు  పోలీసులు తెలిపారు.