భర్త, ఆరుగురు పిల్లలను వదిలేసి బిచ్చగాడితో వెళ్లిపోయిన మహిళ

రోజూ అడుక్కోవడానికి వచ్చి.. ఎవరూ ఊహించని పని చేశాడో  బెగ్గర్. ప్రతిరోజూ ఓ కాలనీకి వచ్చి.. పెట్టింది తిని.. మిగిలింది తీసుకొని వెళ్లే బెగ్గర్.. ఆరుగురు పిల్లలున్న ఓ మహిళతో పరారయ్యాడు. అస్తమానం వచ్చి అడుక్కునే బిచ్చగాని గురించి ఎన్నడూ ఊహించలేదు యజమాని.. పెట్టింది తిని వెళ్తాడులే అనుకున్నాడు. చివరికి యజమానికి ఊహించని షాకిచ్చాడు ఆ భిక్షగాడు. 

ఉత్తరప్రదేశ్ లోని హర్దోయి జిల్లాలో ఓ మహిళ(36) తన భర్త, 6 మంది పిల్లలను వదిలేసి బెగ్గర్ తో వెళ్లిపోయిన ఘటన సంచలనంగా మారింది. తన భార్య భిక్షగాడితో వెళ్లిపోయిందని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు భర్త రాజు కుమార్. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 87 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. 

రాజు కుమార్ (45) తన భార్య రాజేశ్వరి, ఆరుగురు పిల్లలతో హర్దోయి జిల్లాలోని హర్పాల్ పూర్ లో నివాసం ఉంటున్నాడు. తరచుగా అడుక్కోవడానికి వచ్చే నన్హే పండిట్(45) తన భార్యను మాయ మాటలు చెప్పి తీసుకెళ్లాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు.  నన్హే పండిట్ తన భార్యకు స్నేహం తో రెగ్యులర్ గా మాట్లాడేవాడని, అనుమానం వస్తుందని ఇద్దరూ ఫోన్ లో కూడా మాట్లాడుకునే వారని తెలిపాడు. 

ALSO READ | వీడెవడండీ బాబూ: రైల్వే స్టేషన్లలో అమ్మాయిల జుట్టు కత్తిరిస్తున్న సైకో

జనవరి 3న కూరగాయలు, బట్టలు తీసుకొస్తానని తన పెద్ద కూతురు కుష్బూతో చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన తన రాజేశ్వరి తిరిగి రాకపోవటంతో అన్ని చోట్ల వెతికాడట రాజు కుమార్. అయితే ఇంట్లో గేదెను అమ్మగా వచ్చిన డబ్బు, నగలు తీసుకొని పరారయిందట. నన్హే పటేల్ అనే బెగ్గర్ తోనే వెళ్లి ఉంటుందని అనుమానించిన రాజుకుమార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.