భోపాల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తన బాధ్యతలను మహిళా కానిస్టేబుల్ మీనాక్షీ వర్మకు అప్పగించారు. ఒక్కరోజు హోం మంత్రిగా సోమవారం ఆమె బాధ్యతలు తీసుకున్నారు. ఆ టైమ్లో అక్కడికి వచ్చిన ఏడీజీపీ అశోక్ అవస్థి.. హోం మినిస్టర్ సీటులో వర్మను చూసి షాక్ అయ్యారని, ఆ తర్వాత విషయం తెలుసుకొని వర్మ ఇచ్చిన సూచనలు విన్నారని తెలిసింది. హోం మంత్రి గా ప్రజల సమస్యలను వర్మ అడిగి తెలుసుకున్నారు. కాగా, వర్మ హోం మంత్రి రెసిడెన్స్ ఆఫీస్ దగ్గర సెక్యూరిటీగా పని చేస్తున్నారు.
