భర్త ఇంట్లో ఉండగానే వేరొకరితో వీడియో కాల్.. కాసేపటికే భర్తకు షాక్..

  • వీడియో కాల్ మాట్లాడుతూనే మహిళ సూసైడ్
  • మెదక్ జిల్లాలో కోరంపల్లిలో ఘటన

టేక్మాల్‌, వెలుగు : వీడియో కాల్ మాట్లాడుతూనే మహిళ సూసైడ్​ చేసుకున్న ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. ఏఎస్ఐ తుక్కయ్య తెలిపిన ప్రకారం.. టేక్మాల్ మండలం కోరంపల్లి గ్రామానికి చెందిన ఎల్లంపల్లి లావణ్య(38) మంగళవారం మధ్యాహ్నం  ఇంట్లో వేరొకరితో వీడియో కాల్ మాట్లాడుతూ దూలానికి చీరతో ఉరేసుకుంది. కొద్దిసేపటి తర్వాత గమనించిన భర్త ప్రభాకర్ వెంటనే ఆమెను కిందకు దింపాడు. 

అనంతరం పాపన్నపేట మండలం గాంధారిపల్లిలో ఉండే బావమరిది కాశీనాథంకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. మెదక్ హాస్పిటల్ తీసుకెళ్తున్నామని వెంటనే రావాలని కోరాడు. కాగా మార్గమధ్యంలోనే లావణ్య మృతి చెందింది. ఆమె ఫోన్ లో చివరిసారిగా వీడియో కాల్ మాట్లాడిన వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తూ మృతురాలి అన్న కాశీనాథం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్ఐ తెలిపారు.