ముంబై: క్రూయిజ్ షిప్లో రేవ్ పార్టీలో పట్టుబడ్డ డ్రగ్స్‌ను ఓ మహిళ శానీటరీ ప్యాడ్లలో దాచి తీసుకొచ్చిందని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారుల విచారణలో తేలింది. షిప్‌లోకి ఎంటరయ్యే టైమ్‌లో సెక్యూరిటీ చెకింగ్‌లో పట్టుబడకుండా ఉండేందుకే ఇలా చేసిందని చెప్పారు. క్రూయిజ్ షిప్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌లు పరిశీలించగా.. ఓ యువతి శానిటరీ ప్యాడ్లలో నుంచి కొన్ని ప్యాకెట్లను బయటకు తీయడం కనిపించిందని తెలిపారు. మరో ఫుటేజీలో అర్బాజ్ ఖాన్ తన సాక్సుల్లో రహస్యంగా తీసుకొచ్చిన డ్రగ్స్‌ను వినయోగించేందుకు ప్రయత్నిస్తున్నాడని వివరించారు. కాగా, ఈ కేసులో మరొకరిని అరెస్టు చేసినట్లు ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖడే మీడియాకు వెల్లడించారు. ఇందులో ఫారెనర్లకూ సంబంధం ఉందని తేలిందని, ఇద్దరు ఫారెనర్లను కూడా అదుపులోకి తీసుకున్నామని ఆయన వివరించారు.
