పోలింగ్​ కేంద్రం వద్ద మహిళ ప్రచారం

పెబ్బేరు, వెలుగు : ఎంపీ ఎన్నికల్లో భాగంగా వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలోని 203, 205 పోలింగ్  సెంటర్ల​వద్ద ప్రచారం చేస్తున్న ఓ మహిళపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి తెలిపారు. మొబైల్  పార్టీ ఇన్​చార్జి విశ్వం 203, 205 పోలింగ్  కేంద్రాల్లో తనిఖీ చేస్తుండగా బీఆర్ఎస్​ పార్టీకి చెందిన కొంగరి అరుణ బీఆర్ఎస్ కు ఓటేయాలని ఓటర్ల వద్దకు వెళ్లి ప్రచారం చేస్తోందని చెప్పారు.