బస్సు ప్రయాణంలో వాంతి చేసుకున్న మహిళ.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

బస్సు ప్రయాణంలో వాంతి చేసుకున్న మహిళ.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

కొంతమందికి బస్సు ప్రయాణాలు పడవు. అంటే.. బస్సులో ప్రయాణించే టప్పుడు కడుపులో వికారంగా ఉండటం... ఏదో అన్ ఈజీగా ఉండటం... వాంతులు అయ్యే విధంగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.  ఇలాంటి వారు కిటికీ పక్కన కూర్చొంటారు.  వాంటింగ్ వస్తే తల బయట పెట్టి  వాంటింగ్ చేసుకుంటారు.  ఇప్పుడు ఢిల్లీలో  ఇలాంటి ఘటనే జరిగింది.  ఓ యువతి  వాంతి చేసుకుంటుండగా ఆబస్సును మరో  బస్సు ఓవర్ టేక్ చేసింది.  ఇక అంతే రెండు వాహనాల మధ్య ఆమె తల నలిగి పోయింది.  ఈ ప్రమాదంలో ఆ మహిళ మరణించింది. 

 బస్సులో ప్రయాణించిన ఒక యువతి వాంతి చేసుకునేందుకు కిటికీ నుంచి తల బయటకు పెట్టింది. ఇంతలో మరో వాహనం ఓవర్‌ టేక్ చేయడంతో ఆ రెండు వాహనాల మధ్య ఆమె తల నలిగిపోయింది (Woman Head Crushed). ఈ ప్రమాదంలో ఆ మహిళ మరణించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌కు చెందిన 20 ఏండ్ల బాబ్లీ తన అక్క, బావ వారి పిల్లలతో కలిసి కశ్మీర్ గేట్ నుంచి లూధియానా వెళ్తున్నది. హర్యానాకు చెందిన ఆర్టీసీ బస్సులో వారు ప్రయాణించారు. ఆ బస్సు అలీపూర్ ప్రాంతానికి చేరుకోగా బాబ్లీ వాంతి చేసుకునేందుకు తలను కిటికీ నుంచి బయటకు పెట్టింది. ఇంతలో ఒక వాహనం ఆ బస్సును ఓవర్‌ టేక్‌ చేసింది. ఈ నేపథ్యంలో రెండు వాహనాల మధ్య ఆమె తల నలిగి నుజ్జునుజ్జు అయ్యింది. దీంతో ఆ యువతి అక్కడికక్కడే మరణించింది.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్ట్‌మార్టం కోసం యువతి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ యువతి మరణానికి కారణమైన వాహనం కోసం పోలీసులు వెతుకుతున్నారు.