ధర్నాకు దిగిన కానిస్టేబుళ్ల భార్యలు...పాత పద్ధతిలో లీవ్స్ ఇవ్వాలని డిమాండ్ 

గద్వాల, వెలుగు: పాత పద్ధతిలో లీవ్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టెన్త్  బెటాలియన్ కానిస్టేబుళ్ల భార్యలు గురువారం నేషనల్ హైవేపై ధర్నాకు దిగి బైఠాయించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  ఇది వరకు15 రోజులకు ఒకసారి లీవ్స్ ఉండేవన్నారు.

కానీ నవంబర్ 1 నుంచి నెల రోజులకు ఒకసారి లీవ్స్ వచ్చేలా డిపార్ట్మెంట్ వారు మ్యానువల్ రూపొందించారన్నారు. పాత పద్ధతినే లీవ్స్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని రోడ్డుపై బైఠాయించిన వారిని పక్కకు తప్పించి రాకపోకలను పునరుద్ధరించారు.