దేశంలో గడిచిన 24 గంటల్లో అంటే శుక్రవారం ఉదయానికి 96,551 కేసులు నమోదు కాగా 1209 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో కరోనా మరణాల సంఖ్య 76271 ఉండగా..వైరస్ సోకిన బాధితుల సంఖ్య 45లక్షలు దాటినట్లు కేంద్రం తెలిపింది. ఒక్కరోజే భారీ ఎత్తులో కేసులు నమోదు కావడంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 45,62, 615 చేరింది.
ఇందులో 9,43, 480 యాక్టీవ్ కేసులు ఉండగా..35,42,664 మందికి కరోనా తగ్గింది. దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదువుతున్న రాష్ట్రాల్లో మహరాష్ట్ర ప్రథమ స్థానంలో ఉంది.
మహరాష్ట్రలో ఇప్పటి వరకు కరోనా కేసులు 10లక్షలు దాటగా..2,53,100 యాక్టీవ్ కేసులున్నాయి. 6,86, 462 మంది డిశ్చార్జ్ అయ్యారు. 27,787మంది మరణించారు.
ఆంధ్రప్రదేశ్ లో 4, 25,607 మందికి కరోనా తగ్గగా…97,271 యాక్టీవ్ కేసులున్నాయి. 4,634 మంది కరోనాతో మరణించారు.
ఢిల్లీలో 23,773 యాక్టీవ్ కేసులుండగా 1,72,763 మందికి కరోనా తగ్గింది. 4,638మంది కరోనాతో మరణించారని కేంద్రం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది
