ఉద్యోగులకు జీతాలు పెంచిన విప్రో

ఉద్యోగులకు జీతాలు పెంచిన విప్రో
  • పనితీరు, స్థాయిని బట్టి వేతనాల పెంపు
  • ఏడాది వ్యవధిలో రెండోసారి వేతనాల పెంపు ప్రకటించిన విప్రో

కరోనా కష్టకాలంలో అనేక రంగాల వారు ఉద్యోగాలు కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్న తరుణంలో దేశీయ ఐటీ సేవల దిగ్గజ కంపెనీ విప్రో తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.  మెరిట్ ప్రాతిపదికన అంటే పనితీరు, స్థాయిని బట్టి వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించింది. క్యాలెండర్ ఇయర్ లో వేతనాలు పెంచడం రెండోసారి కావడం విశేషం. 
మేనేజర్లు అంతకంటే పై స్థాయి వారికి ఈనెల అంటే జూన్ 1వ తేదీ నుంచే పెంపు అమలులోకి వస్తుందని.. జూనియర్లకు మాత్రం సెప్టెంబర్ 1 నుంచి పెంపు చేసినట్లు సమాచారం. 
మరో దేశీయ ప్రధాన కంపెనీ టీసీఎస్ ఇప్పటికే తన ఉద్యోగులకు తక్కువ వ్యవధిలోనే రెండుసార్లు వేతనాలు పెంచింది. ఇప్పుడు విప్రో కూడా వేతనాల పెంపును ప్రకటించింది. కష్టకాలంలో వేతనాల పెంపు నిర్ణయాన్ని ఉద్యోగులు, వారి కుటుంబాలు సంతోషంగా స్వాగతిస్తున్నాయి.