Good Food : చలి కాలంలో కరకరలాడే స్పెషల్ స్నాక్స్.. ఇంట్లోనే ఇలా చక్కగా తయారు చేసుకోండి..!

శీతాకాలం.. వింటర్​ సీజన్​లో చలికి దవడలు పణుకుతుంటాయి. అలా కాకుండా.... మనం చలినే వణికించాలంటే గట్టిగ సమాధానం చెప్పాల్సిందే. అందుకే... కరకరలాడే స్నాక్స్ తో దవడలకు పనిచెప్తే.. చలి 'జీ హుజార్' అంటుంది. వేడి వేడి స్నాక్స్ లో.. పొగలు కక్కే  ఛాయ్ సిప్పేస్తూ... చలిని సవాల్ చేయొచ్చు. శీతాకాలంలో కొన్ని  వింటర్ స్పెషల్ స్నాక్స్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. . 

మూడు పూటలా భోజనం మాత్రమే తింటుంటే... రెండు రోజులకే బోర్ కొడుతుంది. నాలుక రకరకాల స్నాక్స్ కోసం ఉవ్విళ్లూరుతుంది.   అలాంటప్పుడే నోటికి రుచిగా ఉండే స్నాక్స్ తినాలి. అవి కరకరలాడే స్నాక్స్ అయితే పెద్దలే కాదు... చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు.

బనానా వేఫర్స్ తయారీకి కావలసినవి

  • అరటికాయలు : 4
  • ఉప్పు: 2 టీస్పూన్లు
  • నూనె: సరిపడా
  • మిరియాల పొడి :1 టీస్పూను

తయారీ విధానం : అర కప్పు నీళ్లలో ఉప్పు కలిపి పక్కన పెట్టాలి.  కళాయిలో నూనె వేడి చేసి స్లైడర్ తో అరటికాయలను నేరుగా నూనెలో స్లైస్​ లా  తరగాలి. స్టవ్​ ను సిమ్​ లో  పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు,  నీళ్లు కళాయిలో పోసి బాగా కలపాలి. ఇప్పుడు అరటి చిప్స్ కరకరలాడేలా వచ్చే వరకు గరిటతో తిప్పాలి. అరటికాయ స్లైస్​ లు ఎర్రగా కాలిన తర్వాత బయటకు తీసి  నూనె వదిలేందుకు టిష్యూ పేపర్ మీద వేయాలి. నూనె వదిలాక కాస్త మిరియాల పొడి చల్లు కుని తింటే రుచి అదిరిపోతుంది.

ఆనియన్ రింగ్స్ తయారీకి కావలసినవి

  • ఉల్లిగడ్డలు: ఐదు (పెద్దవి)
  • నూనె: వేగించడానికి సరిపడా 
  • కారం ఒక :టీ స్పూను
  •  మైదా: ఒకటిన్నర కప్పు
  • మిక్స్డ్ హెర్బల్స్: టేబుల్ స్పూను
  • తాగే సోడా :రెండు కప్పులు
  • ఉప్పు : సరిపడా
  • ఉల్లిగడ్డ పేస్ట్: టీ స్పూను
  • మిరియాల పొడి: అర టీస్పూను
  • బ్రెడ్ క్రంబ్స్​: అరకప్పు
  • ఆవ పొడి: అర టేబుల్​ స్పూన్​ 
  • కార్న్ ప్లేక్స్ :పౌడర్: అర కప్పు
  • కొత్తిమీర : నాలుగు ఆకులు

తయారీ విధానం : ఉల్లిగడ్డలను విడివిడిగా వచ్చేలా పొరలు పొరలుగా తరిగి 15నిమిషాలపాటు చల్లని నీళ్లలో నాన బెట్టాలి. తరువాత నీళ్లలో నుండి తీసి పొడి టవల్ మీద అరబెట్టాలి. ఆరిన తర్వాత ఉల్లిగడ్డ పొరల మీద పిండి చల్లాలి. ఈ పిండి తేమను పీల్చుకుంటుంది. ఇప్పుడు మరో గిన్నెలో మైదా, కారం, మిక్స్డ్ హెర్బ్స్, ఉల్లిపా డి, ఆవపొడి, మిరియాలు, ఉప్పు వేసి బాగా కలపాలి. మరోగన్నెలో కార్న్ ప్లేక్స్ పొడి, తరిగిన కొత్తిమీర వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు పొరలుగా కట్ చేసిన ఉల్లిగడ్డలను మైదా మిశ్ర మంలో ముంచి ఆ తర్వాత కార్న్ మిశ్రమంలో దొర్లించాలి. కాగుతున్న నూనెలో వేసి బంగారు రంగు వచ్చేంత వరకు వేగించాలి. తింటుంటే కరకరలాడుతూ.. చాలా రుచిగా ఉంటాయి.

Good Health : వంటింటి చిట్కాలతో.. ఇంట్లోని దోమలు, ఈగలు, బొద్దింకలను ఇలా తరిమేయొచ్చు..

క్యాబేజీ వడ తయారీకి కావలసినవి

  • మినప్పప్పు : అరకప్పు
  •  పచ్చిమిర్చి: ఒకటి
  • ఇంగువ : చిటికెడు
  • క్యాబేజీ : 3/4 కప్పు
  • ఉల్లి తరుగు  : 1/2 కప్పు
  • ఉడికించిన బఠాణీ  : ఒక టేబుల్​ స్పూన్​
  • కొత్తిమీర : పావు కప్పు
  •  ఉప్పు :  తగినంత
  • నూనె: సరిపడా

తయారీ విధానం : మినప్పప్పు ఒక గంట నానబెట్టాలి. పప్పును  పచ్చిమిర్చి, ఇంగువ, పావు కప్పు నీళ్లు కలిపి మెత్తగా రుబ్బాలి. ఇప్పుడు పిండి ముద్దకు క్యాబేజీ, ఉల్లిపాయలు, బరాణీ, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలపాలి. కళాయిలో నూనె పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు పిండి కొంచెం కొంచెంగా చేతిలోకి తీసుకొని మధ్యలో వత్తి మరిగిన నూనెలో వేయాలి. దోరగా కాలిన తర్వాత బయటకు తీసి టొమాటో సాస్తో కలిపి తింటే రుచి మస్తుంటది

బ్రెడ్ పకోడీ తయారీకి కావలసినవి

  • పనీర్​ తరుగు : ఒక కప్పు
  • క్యారెట్ తరుగు :  పావు కప్పు 
  • బఠాణీ పావు కప్పు
  • కారం : అర టీస్పూను
  •  పసుపు : పావు టీస్పూను
  • కొత్తిమీర తరుగు:ఒక టీస్పూను
  • ఉప్పు: సరిపడా 
  • శెనగ పిండి : 3/4 కప్పు
  •  పసుపు : పావు టీస్పూను
  •  కారం :  పావు టీస్పూను
  • ఇంగువ : చిటికెడు
  •  ఉప్పు : సరిపడా
  • బ్రెడ్ స్లైస్​ లు : నాలుగు
  •  నూనె : సరిపడా 

తయారీ విధానం : స్టఫింగ్ పదార్థాలను బాగా కలిపి నాలుగు భాగాలుగా చేయాలి. పనీర్​, బఠాని, కారం,క్యారెట్​ తరుగు స్టప్​ గా కలిపి పక్కకు పెట్టాలి, శెనగపిండిలో  పసుపు, నీళ్లు ,కారం, ఇంగుం, ఉప్పు కలిపి బజ్జీల పిండిలా కలపాలి. ఇప్పుడు బ్రెడ్​ స్లైస్​లలో పనీర్​, బఠానీ  స్టఫ్ ని కూరాలి.  బ్రెడ్​ ముక్కలో స్టఫ్​ పూర్తిగా వేశాక  మరుగుతున్న  నూనెలో వేసి వేగించాలి. ఎర్రగా కాలిన తర్వాత బయటకు తీసి, సాస్​తో నంజుకుని తింటే భలేగుంటాయి..

క్యారెట్ పాన్కెక్స్ తయారీకి కావలసినవి

  •  మైదాపిండి  : అర కప్పు
  •  మొక్కజొన్నపిండి : అరకప్పు
  • వెన్న (కరిగించి):2 టీస్పూన్లు 
  • ఉప్పు :  చిటికెడు
  •  పంచదార : 4 టేబుల్ స్పూన్లు
  •  మిల్క్ పౌడర్ : 5 టేబుల్ స్పూన్లు
  • బాదంపప్పు : 2 టేబుల్​ స్పూన్లు ( సన్నగ తరగాలి)
  •  యాలకుల పొడి : చిటికెడు
  •  నెయ్యు : 2 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం: మైదా పిండి, మొక్కజొన్న పిండి , ఉప్పు, పాలు   అరకప్పు నీళ్లు ఒక గిన్నెలో వేసి ఉండల్లేకుండా కలుపుకోవాలి. పాన్ మీద కొద్దిగా నెయ్యి వేసితిప్పి పిండి పోసి పాన్ కేక్స్​తయారు చేయాలి. క్యారెట్తురుమును ఆవిరి మీద 3 నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు బాండీలో నెయ్యి వేసి క్యారెట్​ తురుమును 2 నిమిషాలు వేగించాలి.  క్యారెట్ బాగా వేగిన తర్వాత చక్కర కలిపి కరిగే వరకు కలపాలి. తర్వాత పాల పొడి వేసి 5నిమిషాలు ఉడికించాలి. బాదంపప్పు , యాలకుల  పొడి వేసి మళ్లీ కలపాలి. పొయ్యి మీద ముంచి దింపి పాన్ కేక్స్ మీద పరిచి రోల్ చేయాలి. అన్నిటి హల్వాతో రోల్ చేసి తింటే భలేగుంటాయి. . . 

–వెలుగు,లైఫ్​‌‌–