ఏపీలో హోరాహోరీగా సాగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగిసాయి. జూన్ 4న వెలువడే ఫలితాల కోసం అంతా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రచారంతో ఊపిరి సలపకుండా బిజీబిజీగా తిరిగిన నేతలు ఇప్పుడు ఫారిన్ ట్రిప్స్ కి వెళ్లి చిల్ అవుతున్నారు. ఇదిలా ఉండగా జూన్ 4ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న ప్రజలకు పొలిసు శాఖ షాకింగ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల ఫలితాల సందర్బంగా మూడు రోజులు వైన్ షాపులు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది పభుత్వం.
జూన్ 3, 4, 5వ తేదీలలో మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్లు ఏపీ డీజీపీ హరీష్ గుప్తా తెలిపారు. ఆదేశాలను ధిక్కరిస్తూ మద్యం అమ్మకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు డీజీపీ. అంతే కాకుండా హోటల్స్, లాడ్జీలలో తనిఖీలు చేసి అనుమానితులను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు.