నేను ఇప్పట్లో వ్యాక్సిన్ తీసుకోను.. ఎందుకంటే?

నేను ఇప్పట్లో వ్యాక్సిన్ తీసుకోను.. ఎందుకంటే?
ఇండోర్: కోవ్యాక్సిన్‌‌, కొవిషీల్డ్‌ టీకాల అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అతి త్వరలో వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలుపెట్టనున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. తొలుత హెల్త్ కేర్ వర్కర్స్‌‌తోపాటు కొవిడ్ వారియర్స్‌కు వ్యాక్సినేషన్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ గురించి మధ్యప్రదేశ్ సీఎం శివ్‌‌రాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. ఇప్పట్లో తాను వ్యాక్సిన్ తీసుకోబోనన్నారు. ప్రాధాన్యత గ్రూపుల వారీగా టీకాను ఇవ్వాలని సూచించారు. ‘ఇప్పుడప్పుడే వ్యాక్సినేషన్ చేయించుకోవద్దని నేను నిర్ణయించా. తొలుత అవసరం ఉన్న, ప్రాధాన్యత గ్రూపుల వారికి టీకాను అందివ్వాలి. ఆ తర్వాతే టీకా వేయించుకుంటా. ప్రయారిటీ గ్రూప్స్‌‌కు మొదట వ్యాక్సిన్ అందించడంపై మనం పని చేయాలి’ అని చౌహాన్ పేర్కొన్నారు.