అధికారంలోకి వస్తే CAAను అమలు చేయము

అధికారంలోకి వస్తే CAAను అమలు చేయము

తమిళనాడులో తాము అధికారంలోకి వస్తే పౌరసత్వ సవరణ చట్టం (CAA)ను అమలుచేయబోమని DMK అధినేత స్టాలిన్‌ స్పష్టం చేశారు. జోలార్‌పేట్‌లోని ఎన్నికల ప్రచారంలో స్టాలిన్‌ మాట్లాడుతూ.. సిఎఎ పై పార్లమెంట్‌లో బీజేపీకీ మద్దతిచ్చిన అన్నాడిఎంకె పై తీవ్ర విమర్శలు చేశారు. అన్నాడిఎంకె, పిఎంకె సభ్యులు CAA కు మద్దతుగా రాజ్యసభలో ఓటు వేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో CAA పై అన్నాడిఎంకె నాటకాలు ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీలకు  డిఎంకె ఎప్పుడూ మద్దతుగానే నిలుస్తుందన్నారు. తాము పార్లమెంట్‌లో CAA బిల్లును వ్యతిరేకించామని తెలిపారు. తాము అధికారంలోకి రాగానే ప్రతి కుటుంబంలోని ఓ మహిళకు రూ.వెయ్యి ఇస్తామని, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గిస్తామని స్టాలిన్‌ హామీ ఇచ్చారు.